For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యూర్ ఫిట్‌లో రూ.1,400 కోట్ల సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడి? యునికార్న్ క్లూబ్‌లోకి స్టార్టప్ కంపెనీ

By Jai
|

హైదరాబాద్: ఆరోగ్య సేవలు, ఫిట్నెస్ రంగంలో సేవలు అందిస్తున్న బెంగళూరుకు చెందిన స్టార్టుప్ కంపెనీ క్యూర్ ఫిట్ త్వరలోనే భారీ పెట్టుబడి అందుకోనుంది. జపాన్ కు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సాఫ్ట్ బ్యాంకు దాదాపు రూ 1,400 కోట్లు (200 మిలియన్ డాలర్లు ) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ది టైమ్స్ అఫ్ ఇండియా వెల్లడించింది. ఈ పెట్టుబడి మరింత పెరిగి రూ 2,100 కోట్లు (300 మిలియన్ డాలర్లు ) చేరుకొనే అవకాశం కూడా ఉంటేటట్లు తెలుస్తోంది.

ఐటీఆర్ ఫైలింగ్ గడువుదాటితే జరిమానా ఎంతంటే?ఐటీఆర్ ఫైలింగ్ గడువుదాటితే జరిమానా ఎంతంటే?

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మింట్రా ను నెలకొల్పిన ముకేశ్ బన్సల్ క్యూర్ ఫిట్ నూ స్థాపించారు. ఫ్లిప్కార్ట్ సీనియర్ ఉద్యోగి అంకిత్ నాగోరి తో కలిసి అగర్వాల్ 2016 లో క్యూర్ ఫిట్ ను స్థాపించారు. 2014 లోనే అగర్వాల్ తన స్టార్టుప్ మింట్రా ను రూ 2,100 కోట్ల భారీ మొత్తానికి విక్రయించిన విషయం తెలిసిందే.

SoftBank may invest in health startup CureFit, deal to make Mukesh Bansal co a unicorn

ఇటీవలే 75 మిలియన్ డాలర్లు (రూ 500 కోట్లకు పైగా) క్యూర్ ఫిట్ సమీకరించింది. ఒక వేళా సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడి అందితే ... క్యూర్ ఫిట్ విలువ ఏకంగా 1 మిలియన్ డాలర్లు (రూ 7,000 కోట్లు ) ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కంపెనీ విలువ అందులో సగమే కావడం గమనార్హం.

క్యూర్ ఫిట్ ఇప్పటికే దెస వ్యాప్తంగా బడా నగరాల్లో విస్తరించింది. కల్ట్ ఫిట్ పేరుతో ఈ కంపెనీ బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ నగరాల్లో 130 కల్ట్ ఫిట్ కేంద్రాలను ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికీ ఈ సంఖ్యను 250 కి పెంచుకోవాలని చూస్తోంది. అలాగే 10 నగరాలకు విస్తరించాలనేది ప్రణాళిక. అంతే కాకుండా దుబాయ్ వంటి విదేశీ మార్కెట్లోకి విస్తరించే ప్లన్స్ ఉన్నట్లు గతంలో ఈ స్టార్టుప్ కంపెనీ వెల్లడించింది. రెండు మూడేళ్ళ లోనే ఫిట్ నెస్ కేంద్రాల సంఖ్యను 1,000 కి పెంచు కోవాలని టార్గెట్ పెట్టుకొంది.

క్యూర్ ఫిట్ ఫుడ్ డెలివరీ రంగం లోకి కూడా విస్తరించింది. ఈట్ ఫిట్ పేరుతో ఈ బ్రాండ్ ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈట్ ఫిట్ ద్వారా రోజుకు 30,000 నుంచి 35,000 ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోందట. డయాగ్నొస్టిక్ సేవలు అందించేందుకు కేర్ ఫిట్ అని, వెల్నెస్ కోసం మైండ్ ఫిట్ అనే బ్రాండ్స్ ను కూడా పరిచయం చేసింది ఈ సంస్థ.

బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ తో ఈ కంపెనీ ఇప్పటికే భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొన్నా విషయం తెలిసిందే. అయన కొంత మొత్తం ఈ కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే హ్రితిక్ రోషన్ బ్రాండ్ అంబాసడార్జ్ వ్యవహరించేందుకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ లో కొంత క్యూర్ ఫిట్ లో పెట్టుబడిగా మార్చుకున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్ , మరో బాలీవుడ్ హీరో టైగర్ శ్రోఫ్ఫ్ తో కూడా ఇలాంటి భాగస్వామ్యాలు కుదుర్చుకొని కొత్త తరహా దుస్తులు సహా రకరకాల ప్రొడక్టులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టె ఆలోచనలు వేగిరం చేసినట్లు తెలుస్తోంది.

English summary

క్యూర్ ఫిట్‌లో రూ.1,400 కోట్ల సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడి? యునికార్న్ క్లూబ్‌లోకి స్టార్టప్ కంపెనీ | SoftBank may invest in health startup CureFit, deal to make Mukesh Bansal co a unicorn

SoftBank Vision Fund is in talks to invest over $200 million in Bengaluru based healthcare and wellness startup CureFit.
Story first published: Monday, June 24, 2019, 8:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X