For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ నష్టాల బాటలోనే ముగింపు

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభంలో కూడా మళ్లీ నష్టాలనే మిగిల్చాయి. గతవారమంతా నిరుత్సాహంగా సాగిన మార్కెట్లలో ఈ రోజూ అదే ధోరణి కనిపించింది. ఆద్యంతం అక్కడక్కడే కొట్టుమిట్టాడినప్పటికీ చివరకు నష్టాల బాట పట్టక తప్పలేదు. ప్రధానం ఆటో, మెటల్, రియాల్టీ రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా నమోదైంది. కొన్ని ఎఫ్ఎంసిజి కంపెనీల స్టాక్స్‌తో పాటు ప్రభుత్వ బ్యాంకుల స్టాక్స్ మాత్రమే కొద్దిగా లాభపడ్డాయి. మిగిలిన అన్ని సెక్టోరల్ సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. చివరకు సెన్సెక్స్ 72 పాయింట్లు కోల్పోయి 39122 దగ్గర, నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 11699 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 30602 దగ్గర క్లోజయ్యాయి.

యూపీఎల్, యెస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండియాబుల్స్ హౌసింగ్, టిసిఎస్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, వేదాంతా, టాటా స్టీల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.

Sensex, Nifty end marginally lower in volatile trade

మళ్లీ కాంట్రవర్సీ స్టాక్స్ దూకుడు
గత రెండు, మూడు వారాలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న స్టాక్స్‌లో మళ్లీ యాక్టివిటీ మొదలైంది. ఒక రోజు లాభం.. రెండు రోజుల నష్టం అనేట్టు సాగుతున్న ఈ స్టాక్స్‌ ఈ రోజు తేరుకున్నాయి. జైన్ ఇరిగేషన్ 14 శాతం, సుజ్లాన్ 10 శాతం, లక్ష్మీవిలాస్ బ్యాంక్ 8 శాతం, వక్రంజీ 8 శాతం, దివాన్ హౌసింగ్ - జెకె బ్యాంక్ 7 శాతం పెరిగాయి.

ఈ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు అంతలా పడ్తున్నాయి అని విశ్లేషించడం కష్టంగా ఉంది. తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్న ఈ స్టాక్స్‌లో ట్రేడింగ్ మరింత రిస్కీగా మారుతోంది.

రిలయన్స్ 'పవర్' పోతోంది
ఓ బ్లాక్ డీల్ ద్వారా సుమారు 53 లక్షల రిలయన్స్ పవర్ షేర్లు చేతులు మారాయి. దీంతో స్టాక్ఒ క్కసారిగా పతనమైంది. గత ఐదు రోజుల్లో 10 శాతం, నెల రోుల్లో 40 శాతం వరకూ పడిన రిలయన్స్ పవర్ ఈ రోజు మరో 16 శాతం తగ్గింది. పెన్నీ స్టాక్ అయిపోయిన ఆర్.పవర్‌ రూ.4.61 దగ్గర క్లోజైంది.

ఇదే బాటలో ఇమామీ స్టాక్ కూడా పతనమైంది. సుమారు 7.2 శాతం ఈక్విటీ బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారింది. వరుసగా పదో సెషన్‌లోనూ నష్టపోయిన స్టాక్ చివరకు 8 శాతం నష్టంతో రూ.267 దగ్గర క్లోజైంది.

రెండేళ్ల కనిష్టానికి టీవీఎస్ మోటార్స్అం
తకంతకూ సేల్స్ పడిపోతున్న నేపధ్యంలో టీవీఎస్ మోటార్స్ షేర్ ధర రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ రోజు కూడా వాల్యూమ్స్‌తో స్టాక్ పతనమైంది. యావరేజ్‌తో పోలిస్తే సుమారు మూడు రెట్లు అధికంగా ట్రేడ్ వాల్యూమ్స్ నమోదయ్యాయి. చివరకు స్టాక్.. రూ.428 దగ్గర క్లోజైంది.

రైట్స్ బోనస్ ఇష్యూ
ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ ప్రతీ నాలుగు షేర్లకూ ఒక్క బోనస్ షేర్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. దీనిపై బోర్డు అధికారిక నిర్ణయం ఇక లాంఛనమే. బోనస్ పై ముందు నుంచీ ఊహాగానాలున్న నేపధ్యంలో వార్త వెలువడిన వెంటనే స్టాక్ పతనమైంది. 2.5 శాతం నష్టంతో రూ.276.55 దగ్గర స్టాక్ క్లోజైంది.

గ్లెన్‌కు ఎఫ్డీఏ దెబ్బ
గ్లెన్‌మార్క్ తయారు చేస్తున్న ర్యాల్‌ట్రిస్ నాసల్ స్ప్రే డ్రగ్ మాస్టర్ ఫైల్‌ పై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలంటూ యూఎస్ ఎఫ్ డి ఏ కోరింది. దీంతో గ్లెన్ స్టాక్ పతనమైంది. ఈ అంశాన్ని ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పరిష్కరించుకోవాలని కంపెనీ చూస్తోంది. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ 8 శాతం పతనమై రూ.461 దగ్గర క్లోజైంది.

English summary

మళ్లీ నష్టాల బాటలోనే ముగింపు | Sensex, Nifty end marginally lower in volatile trade

Benchmark indices closed Monday's session with marginal cuts, dragged down by metal stocks, amid weak global cues and rise in oil price.
Story first published: Monday, June 24, 2019, 17:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X