For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిన్నీ బన్సాల్ అనూహ్య నిర్ణయం, రూ.531 కోట్ల ఫ్లిప్‌కార్ట్ షేర్లు విక్రయం

|

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో బిన్నీ బన్సాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న ఆయన, తాజాగా ఫ్లిప్‌కార్ట్ షేర్లను మాతృసంస్థ వాల్‌మార్ట్‌కు విక్రయించారు. రూ.531 కోట్ల (76.4 మిలియన్లు డాలర్లు) విలువైన దాదాపు 54 లక్షల ఈక్విటీ షేర్లను వాల్‌మార్ట్ లక్సెంబర్గ్ సంస్థ ఎఫ్ఐటీ హోల్డింగ్స్ సార్ల్‌కు విక్రయించారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో ఆయన వాటా 3.85 శాతం నుంచి 3.52 శాతానికి పడిపోయింది. అంటే ఆయన వాటా 0.33 శాతం తగ్గింది.

రూ.42 చెల్లిస్తే రూ.1,000: APY గురించి పూర్తి వివరాలు...రూ.42 చెల్లిస్తే రూ.1,000: APY గురించి పూర్తి వివరాలు...

5,39,912 షేర్ల కొనుగోలు ద్వారా వాల్‌మార్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లో మరింత వాటా దక్కించుకుంది. రెగ్యురేటరీకి ఫ్లిప్‌కార్ట్ చెప్పిన దాని ప్రకారం బన్సాల్ 5,39,912 షేర్లను 76.4 మిలియన్ డాలర్లకు వాల్‌మార్ట్ ఎన్టీటీకి విక్రయించారు.

Flipkarts Binny Bansal sells Rs.531 crore worth stake to Walmart

ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం మేజర్ వాటాను వాల్‌మార్ట్ గతంలోనే కొనుగోలు చేసింది. ఆ సమయంలోనే మరో కో-ఫౌండర్ సచిన్ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. తన మొత్తం వాటాలను విక్రయించారు. బిన్నీ బన్సాల్ మాత్రం ఫ్లిప్‌కార్టులో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన తప్పుకున్నారు.

బిన్నీబన్సాల్ తన షేర్లను విక్రయించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ దక్కించుకున్నప్పుడు బిన్నీ బన్సాల్ షేర్లు 74,76,271 నుంచి 63,53,838 తగ్గిపోయాయి. ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ దక్కించుకున్న సమయంలో 159 మిలియన్ డాలర్లకు 11,22,433 షేర్లు విక్రయించాడని అంచనా.

English summary

బిన్నీ బన్సాల్ అనూహ్య నిర్ణయం, రూ.531 కోట్ల ఫ్లిప్‌కార్ట్ షేర్లు విక్రయం | Flipkart's Binny Bansal sells Rs.531 crore worth stake to Walmart

Binny Bansal, the co-founder and former CEO of Flipkart, has offloaded another 54 lakh of his equity shares to parent company Walmart, according to a regulatory filing.
Story first published: Monday, June 24, 2019, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X