For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహనదారులకు శుభవార్త: ఇక సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్‌లలో పెట్రోల్, డీజిల్!

|

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఐడియాలతో ముందుకెళ్తోంది. వాహనదారులకు త్వరలో సూపర్ మార్కెట్‌లలో కూడా పెట్రోల్, డీజిల్ లభించే అవకాశాలు కొట్టి పారేయలేం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పట్టణ కార్మికులకు గుడ్‌న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే అద్దె ఇళ్లు పట్టణ కార్మికులకు గుడ్‌న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే అద్దె ఇళ్లు

సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్‌లో పెట్రోల్!

సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్‌లో పెట్రోల్!

సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో రిటైల్‌గా పెట్రోల్, డీజిల్ విక్రయించేందుకు అనుగుణంగా త్వరలో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ (పెట్రోలియం అండ్ నేచరల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ) కేబినెట్ నోట్ తీసుకు రావొచ్చునని తెలుస్తోంది. ప్రస్తుత నిబంధనలు సడలించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందట. సమాచారం మేరకు... సాధారణ గ్యాస్ స్టేషన్ల (పెట్రోల్ బంకులు)తో పాటు ఇతర అవుట్ లెట్లలోను పెట్రోల్, డీజిల్ రిటైల్‌గా అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకు రానుందని చెబుతున్నారు.

మల్టీ బ్రాండ్ కంపెనీలకు గేట్లు ఓపెన్

మల్టీ బ్రాండ్ కంపెనీలకు గేట్లు ఓపెన్

ప్రయివేటు కంపెనీలు రిటైల్ (పెట్రోల్, డీజిల్) మార్కెట్లోకి వచ్చేందుకు రిక్వయిర్మెంట్స్‌ను సడలించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దాదాపు రూ.2,000 కోట్ల డొమెస్టిక్ మార్కెట్, రూ.30 లక్షల బ్యాంకు గ్యారెంటీ ఉండాలి. దీనిని ఈజ్ చేసేందుకు ప్రభుత్వం దీనిని సడలించనుంది. అలా చేస్తే మల్టీబ్రాండ్ దిగ్గజాలు ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌తో పాటు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ సౌదీ ఆరామ్‌కో వంటి సంస్థలు ఇండియన్ రిటైల్ ఫ్యూయల్ మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశముంటుంది.

పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం

పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం

మే 30వ తేదీన మోడీ-2.0 ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ఆ రోజు నుంచి వంద రోజుల్లో దీనిని అమలు చేయాలని కేంద్రం భావించిందట. ఎకనమిస్ట్ కిరీట్ పరీఖ్ సారథ్యంలోని అయిదుగురు సభ్యుల కమిటీ ఇంధన రిటైలింగ్ విధానానికి సంబంధించి సడలింపు నిబంధనలు ప్రతిపాదించిందట. సులభంగా, తగ్గింపు ధరల్లో ఇంధనాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించింది. సెప్టెంబర్ మొదటి వారంలో దీనికి సంబంధించిన విధివిధానాలు తుది రూపు దాల్చనున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డుకట్ట పడనుందని భావిస్తున్నారు.

హోమ్ డెలివరీ

హోమ్ డెలివరీ

ఇదిలా ఉండగా, గత ఏడాది మార్చి 16న పుణేలో ఫ్యూయల్ హోమ్ డెలివరీ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCO), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) వంటి రిటైలర్స్ పుణే, ఢిల్లీ, జాన్‌పూర్, చెన్నై, బెంగళూరు, అలీగఢ్, రేవారీ, నావీ ముంబై వంటి చోట్ల హోమ్ డెలివరీని అందిస్తున్నాయి. మరోవైపు, సూపర్ మార్కెట్‌లలో పెట్రోల్, డీజిల్ అనే కాన్సెప్ట్ యూకేలో ఉంది. అక్కడి పెట్రోల్ రిటైలర్స్ అసోసియేషన్ (PRA) లెక్కల ప్రకారం సూపర్ మార్కెట్‌లో దాదాపు 49 శాతం పెట్రోల్, 43 శాతం డీజిల్ విక్రయాలు ఉన్నాయి.

English summary

వాహనదారులకు శుభవార్త: ఇక సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్‌లలో పెట్రోల్, డీజిల్! | Petrol, diesel may be sold in supermarkets, government to come up with proposal soon

Customers may soon be able to purchase petrol and diesel in supermarkets other than the regular fueling stations.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X