For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్‌బుక్ నుంచి డిజిటల్ కరెన్సీ: లిబ్రాగా ప్రకటించిన సోషల్ మీడియా దిగ్గజం

|

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన సొంత డిజిటల్ కరెన్సీని ప్రకటించింది. ఆ కరెన్సీకి లిబ్రా అని నామకరణం చేసింది. ఈ ప్రయత్నంతో డిజిటల్ బ్యాంకింగ్ ప్రపంచలోకి ఫేస్‌బుక్ అడుగుపెట్టినట్లు అయ్యింది. ఇక ఫేస్‌బుక్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు డిజిటల్ లావాదేవీలు చేసుకునే వెసులుబాటును కల్పించనుంది.

ఇక సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థకు అలవాటు పడ్డ వారిని సైతం లిబ్రా తనవైపు ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేసింది ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవారు లిబ్రా క్రిప్టో కరెన్సీకి అలవాటు పడితే ఇక లావాదేవీలకు దీన్నే వినియోగిస్తారనే ఆశాభావం ఫేస్‌బుక్ యాజమాన్యం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే దాదాపు 2.4 బిలియన్ వినియోగదారులు ఉన్న ఫేస్‌బుక్‌పై వ్యక్తిగత లావాదేవీలు చోరీకి గురికాకుండా గట్టి సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనలిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

Facebook Announces Digital Currency Libra
ఇక 2020 నాటికి లిబ్రా యాప్ ద్వారా లావాదేవీలు చేసుకునే వీలు కల్పిస్తామని చెప్పిన ఫేస్‌బుక్ యాజమాన్యం ..వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ జరిగేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. లిబ్రాకు తోడుగా కాలిబ్రా అనే మరో సబ్సిడరీని ఫేస్‌బుక్ ప్రవేశపెట్టింది. ఇదొక డిజిటల్ వాలెట్‌లా పనిచేస్తుందని ఇందులో డిజిటల్ రూపంలో డబ్బులు నిల్వ చేసుకోవడం, లేదా డబ్బులు బదిలీ చేయడం లేదా ఖర్చు చేసేందుకు అవసరమవుతుందని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. ఈ వాలెట్ వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లతో అనుసంధానమై ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. రోమన్ భాషలో బరువులను సంబోధించేందుకు లిబ్రాను వాడుతామని అక్కడి నుంచే ఈ పదం తీసుకోవడం జరిగిందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న డేవిడ్ మార్కస్ తెలిపారు.

English summary

ఫేస్‌బుక్ నుంచి డిజిటల్ కరెన్సీ: లిబ్రాగా ప్రకటించిన సోషల్ మీడియా దిగ్గజం | Facebook Announces Digital Currency Libra

On Tuesday, Facebook Inc announced its own digital currency and called it Libra. With hopes to shake the world's banking system, the social networking giant aims to make the currency available to billions of its users to make financial transactions across the globe.
Story first published: Tuesday, June 18, 2019, 18:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X