For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువే ఇస్తున్నారు.. వద్దు: రూ.405 కోట్ల ఇన్సెంటివ్ వద్దన్న సుందర్ పిచాయ్

|

గూగుల్ సీఈవో సుందర్ పిచాయి.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం కలిగిన కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు. అలాంటి ఆయన రెండేళ్ల కంటే మించి ఈక్విటీలు అందుకోలేదు. ఇందుకు ప్రధాన కారణం... తనకు గూగుల్ స్వచ్చంధంగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చిందని, కాబట్టి తనకు ఈక్విటీ అవార్డ్స్ అవసరం లేదని ఆయన భావించడం వల్లే. 2018లో ఆయన వీటిని తిరస్కరించారట.

భారత్‌లో 110 నగరాలకు అమెజాన్ ప్యాంట్రీ సేవలుభారత్‌లో 110 నగరాలకు అమెజాన్ ప్యాంట్రీ సేవలు

నో చెప్పిన సుందర్ పిచాయ్

నో చెప్పిన సుందర్ పిచాయ్

సాధారణంగా ఎక్కడైనా ఏ ఉద్యోగి అయినా వేతనం మరింత కోరుకుంటాడు. తమకు ఎంత ఇచ్చినా అప్పటికి సంతృప్తి చెందినప్పటికీ ఆ తర్వాత మరింత ఆశించేవారు ఉంటారు. కానీ తాను చేస్తున్న దానికంటే తనకు ఇప్పటికే ఎక్కువ వేతనం వస్తోందని, తనకు అదనంగా అవసరం లేదని చెప్పేవారు దాదాపు దొరకరనే చెప్పవచ్చు. కానీ సుందర్ పిచాయ్ మాత్రం ఆ పని చేయడం గమనార్హం.

రూ.405 కోట్లకు నో

రూ.405 కోట్లకు నో

తన ప్రతిభకు మెచ్చి గూగుల్ తనకు అదనంగా ఇవ్వజూపిన రూ.405 కోట్లను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ మొత్తాన్ని ఇన్సెంటివ్‌గా ఇవ్వజూపింది. తనకు ఇప్పటికే వేతన రూపంలో కంపెనీ ఎక్కువగా చెల్లిస్తోందని, అదనంగా అవసరం లేదని చెప్పారు. లింక్డిన్ సీఈవో జెఫ్ వీనర్ కూడా గతంలో ఇలాగే నిరాకరించారు. గతంలో తనకు వచ్చిన 14 మిలియన్ డాలర్లను జెఫ్ వీనర్ ఉద్యోగులకు బదలీ చేశాడు.

కార్పోరేట్ సీఈవోల్లో సుందర్ పిచాయ్ టాప్

కార్పోరేట్ సీఈవోల్లో సుందర్ పిచాయ్ టాప్

ప్రపంచంలోని అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పోరేట్ సీఈవోల్లో సుందర్ పిచాయ్ ఒకరు. ఫోర్బ్స్ మోస్ట్ రిప్యూటబుల్ సీఈవోల్లో సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే టాప్‌లో నిలిచారు. ఆయనకు ఏడాదికి దాదాపు రూ.1,300 కోట్ల వేతనం. ఆయన జీతాన్ని గూగుల్ ఈ ఏడాది మళ్లీ సవరించనుంది. దీంతో ఆయన వేతనం పెరిగే అవకాశముంది.

స్టాక్స్ ఇవ్వడం సాధారణమే

స్టాక్స్ ఇవ్వడం సాధారణమే

కార్పోరేట్ కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీల్లో స్టాక్స్ ఇవ్వడం సాధారణమే. సుందర్ పిచాయ్ 2016లో చివరిసారి స్టాక్స్ తీసుకున్నారు. సుందర్ పిచాయ్ ఏడాది ప్యాకేజీ 650,000 డాలర్లు. పర్సనల్ సెక్యూరిటీతో పాటు 58.1 మిలియన్ డాలర్ల విలువ కలిగిన 51,249 షేర్లు ఉన్నాయి.

English summary

ఎక్కువే ఇస్తున్నారు.. వద్దు: రూ.405 కోట్ల ఇన్సెంటివ్ వద్దన్న సుందర్ పిచాయ్ | Sundar Pichai refused Google stock worth millions

Google CEO Sundar Pichai has enough wealth that he has declined bonus of Rs 405 crore. Pichai says that he is getting paid enough. But Pichai's decision to turn down $58.1 million worth of shares has also sparked rumours around his departure as chief executive officer of Google.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X