For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9వ రోజు పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు: ఎన్నికల తర్వాత ఎంత పెరిగిందంటే?

|

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ముందు ఊహించిందే. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దాదాపు రూ.10 వరకు పెరగవచ్చునని ముందే అంచనాలు వచ్చాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్నందున ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ధరల పెరుగుదల మాత్రం పక్కా అని ముందే తేలిపోయింది. సార్వత్రిక ఎన్నికలు మే 19వ తేదీన ముగిశాయి. 23వ తేదీన ఫలితాలు వచ్చాయి. ఎన్నికలు ముగిసిన (19వ తేదీ) మరుసటి రోజు నుంచి పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి.

ఎన్నికల మరుసటి రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: త్వరలో 15 శాతం పెరగొచ్చు!ఎన్నికల మరుసటి రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: త్వరలో 15 శాతం పెరగొచ్చు!

9 రోజుల్లో దాదాపు 80 పైసలు పెరిగిన ధర

9 రోజుల్లో దాదాపు 80 పైసలు పెరిగిన ధర

గత తొమ్మిది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 70-80 పైసల వరకు పెరిగింది. ఎన్నికల అనంతరం మే 20వ తేదీన తొలిసారి ధరలు పెరిగాయి. ఈ తొమ్మిది రోజుల్లో పెట్రోల్ ధర 83 పైసలు, డీజిల్ ధర 73 పైసలు పెరిగింది. మంగళవారం నాడు పెట్రోల్ 9 పైసలు, డీజిల్ 5 పైసలు పెరిగింది. రోజుకు పది పైసలు, ఐదు పైసల చొప్పున ఇప్పటి వరకు 80 పైసల వరకు పెరిగింది.

9 రోజుల్లో ఎక్కడ ఎంత పెరిగిందంటే?

9 రోజుల్లో ఎక్కడ ఎంత పెరిగిందంటే?

మే 19వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ.71.03 ఉండగా, మే 28 నాటికి రూ.71.86కు చేరుకుంది. డీజిల్ ధర మే 19న రూ.65.96 ఉండగా, మే 28వ తేదీ నాటికి 66.69కి చేరుకుంది. ముంబైలో పెట్రోల్ రూ.77.47, డీజిల్ రూ.69.88కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, అమరావతిల్లోను పెట్రో, డీజిల్ ధరలు దాదాపు 70 నుంచి 80 పైసల మధ్య పెరిగింది.

9వ రోజు పెట్రో ధరలకు రిలీఫ్

9వ రోజు పెట్రో ధరలకు రిలీఫ్

తొమ్మిది రోజుల పాటు స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం (మే 29) మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.71.86, లీటర్ డీజిల్ రూ.66.69గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.73.92, డీజిల్ 68.45, ముంబైలో పెట్రోల్ రూ.77.47, డీజిల్ రూ.69.88, చెన్నైలో పెట్రోల్ రూ.74.59, డీజిల్ రూ.70.50, నోయిడాలో పెట్రోల్ రూ.71.44, డీజిల్ రూ.65.75, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.71.96, డీజిల్ రూ.65.84గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.76.22, డీజిల్ రూ.72.53, అమరావతిలో రూ.75.96, డీజిల్ రూ.71.87, విజయవాడలో రూ.75.60, డీజిల్ రూ.71.55గా ఉంది.

English summary

9వ రోజు పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు: ఎన్నికల తర్వాత ఎంత పెరిగిందంటే? | Petrol prices rise by 83 paise and diesel by 73 paise days after May 19

Prices of petrol and diesel have been on the rise since the final phase of polling in the Lok Sabha elections ended on 20 May.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X