For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్‌వేస్ ఎఫెక్ట్: ఇండిగో లాభం ఐదు రెట్లు, రూ.600 కోట్లు

|

ఇండియా లార్జెస్ట్ ఎయిర్ లైన్స్ మార్కెట్ షేర్ కలిగి ఉన్న ఇండిగో క్వార్టర్ 4లో దాదాపు రూ.600 కోట్ల నెట్ లాభాన్ని ఆర్జించింది. మార్చి 2019 చివరి నాటికి రూ.589.6 కోట్ల నెట్ ప్రాఫిట్ ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభానికి ఇది అయిదు రెట్లు కావటం గమనార్హం. ఈ క్వార్టర్‌లో 12 శాతం పెరిగాయి. జనవరి - మార్చి మధ్య సీటుకు కిలోమీటర్‌కు ఆదాయం 5.9 శాతం పెరిగి రూ.3.63గా ఉంది.

కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇండిగో లాభపడింది. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం తర్వాత ఇండిగోతో పాటు స్పైస్ జెట్ వంటి ఇతర విమానయాన సంస్థలకు కూడా పాసింజర్ ఫ్లో పెరిగింది. 2020 సంవత్సరానికి గాను సీటుకు కిలోమీటర్‌కు 30 శాతం పెరుగదల ఉంటుందని ఇండిగో అంచనా వేస్తోంది.

Indias largest airline IndiGo posts Rs 600 crore profit in Q4

ఇండియా సిమెంట్స్ లాభం
గత ఆర్థిక సంవత్సరం క్వార్టర్ ఫోర్‌లో ఇండియా సిమెంట్స్ రూ.43.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సిమెంట్ ఉత్పత్తి, నికర ప్లాంట్ వినియోగం పెరగడంతో రికార్డు లాభం నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ రూ.35.27 కోట్లు. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.1,401.73 కోట్ల నుంచి రూ.1,581.36 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం నెట్ ప్రాఫిట్ రూ.100 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది దాదాపు రూ.70 కోట్లు.

Read more about: indigo profit ఇండిగో
English summary

జెట్ ఎయిర్‌వేస్ ఎఫెక్ట్: ఇండిగో లాభం ఐదు రెట్లు, రూ.600 కోట్లు | Indias largest airline IndiGo posts Rs 600 crore profit in Q4

India's largest airline by market share, IndiGo, posted profits of nearly Rs 600 crore in the fourth quarter, ending March 2019. This was a more than 5 fold rise in profits compared to the year ago quarter.
Story first published: Monday, May 27, 2019, 18:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X