For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోషల్ మీడియాను వాడటం వచ్చా? మీ కోసం కోసమే బంపరాఫర్.. రూ.26 లక్షల జీతం!

|

మీరు సోషల్ మీడియా మంచి ఎక్స్‌పర్టా? అయితే ఈ బంపరాఫర్ మీ కోసమే! ఎందుకంటే క్వీన్ ఎలిజబెత్ II కోసం బ్రిటిష్ రాయల్ కమ్యూనికేషన్ సోషల్ మీడియా మేనేజర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం క్వీన్ ఎలిజబెత్ కోసం డిజిటల్ కమ్యూనికేషన్ ఆఫీసర్ కోసం వెతుకుతోంది. ఈ మేరకు బ్రిటిష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ తన జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్లో పేర్కొంది. సదరు సోషల్ మీడియా మేనేజర్... రాణి ఎలిజబెత్‌ను ప్రపంచానికి మరింత కొత్తగా, వినూత్నంగా పరిచయం చేయాల్సి ఉంటుంది. అందుకు సరికొత్త మార్గాలు అన్వేషించవలసి ఉంటుంది. ఇదే విషయాన్ని అందులో పేర్కొన్నారు.

మరోసారి నరేంద్ర మోడీయే గెలిస్తే ఆర్థిక మంత్రి ఎవరు?మరోసారి నరేంద్ర మోడీయే గెలిస్తే ఆర్థిక మంత్రి ఎవరు?

వేతనం రూ.26,57,655

వేతనం రూ.26,57,655

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ఆకట్టుకోవాలి. ఇందుకు ఇచ్చే వేతనం దాదాపు 30,000 బ్రిటిష్ పౌండ్లు. ఇది మన రూపాయల్లో రూ.26,57,655. క్వీన్ ఎలిజబెత్, బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ సోషల్ మీడియా మేనేజర్‌గా పని చేస్తున్నందున మీ వైపు ఎంతోమంది చూస్తారు.

మీకు లాభమేమిటి?

మీకు లాభమేమిటి?

క్వీన్ ఎలిజబెత్ వద్ద పని చేస్తున్నందున మీరు అందరి దృష్టిలో పడతారు. మీ ఫీచర్ ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు. మీరు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి పని చేస్తున్నందున మీ పోస్టులు ఎంతోమంది చూస్తారు. అలాగే, మీకు భారీ వేతనంతో పాటు మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. జీతంతో పాటు 15 శాతం పెన్షన్ పథకం వర్తిస్తుంది. అయితే ఇది ఉద్యోగంలో చేరిన ఆరు నెలల తర్వాత నుంచి అప్లై అవుతుంది. ఏడాదికి 33 రోజులు సెలవులు. ఇందులో బ్యాంక్ హాలీడేస్ కూడా కలిపి. ఉచిత భోజనం. దీంతో పాటు మీ వృత్తిపరమైన నిరంతర అభివృద్ధికి శిక్షణ. వారానికి 37.5 గంటలు పని చేయాలి (సోమవారం నుంచి శుక్రవారం వరకు).

అర్హతలు ఏమిటి?

అర్హతలు ఏమిటి?

క్వీన్ ఎలిజబెత్ సోషల్ మీడియా మేనేజర్‌గా పని చేసేందుకు డిగ్రీతో పాటు వెబ్‌సైట్‌లో పని చేసిన అనుభవం ఉండాలి. అద్భుతమైన ప్లానింగ్ ఫోటోగ్రఫీ, వీడియో నైపుణ్యాలు అవసరం. ప్రాధాన్యతను బట్టి చురుకుగా స్పందించాలి. డిజిటల్, సోషల్ మీడియా కంటెంట్‌ను క్రియేట్ చేయాలి. లేటెస్ట్ డిజిటల్ కమ్యూనికేషన్స్ డెవలప్‌మెంట్స్ మీద పట్టు ఉండాలి. సృజనాత్మకత నైపుణ్యం అవసరం. డిజిటల్ కంటెంట్ రూపకల్పనలో నైపుణ్యంతో పాటు రైటింగ్, ఎడిటోరియల్ స్కిల్స్ అవసరం. డిజిటల్, సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాంలలో రోజువారీ వార్తా విశేషాలను, ఫీచర్ కథనాలను తెలుకుసొని, పరిశోధించాలి. వివిధ ఆడియన్స్ గ్రూప్‌లను ఆకర్షించాలి. ఫ్లెక్సిబుల్ అప్రోచ్ అవసరం. పబ్లిక్‌లో క్వీన్ ఎలిజబెత్‌ను సరికొత్తగా చూపించాలి. క్వీన్ ఉనికిని మరింతగా తెలియచేసేందుకు కొత్త మార్గాలు వెతకాలి. డెయిలీ న్యూస్ ఫాలో కావాలి.

English summary

సోషల్ మీడియాను వాడటం వచ్చా? మీ కోసం కోసమే బంపరాఫర్.. రూ.26 లక్షల జీతం! | Buckingham Palace Calling! Queen Elizabeth Hiring Social Media Manager At Salary Of Rs 26 Lakh

The British Royal communications team has a lucrative opening -- the post of a Digital Communication Officer for the one and only Queen Elizabeth II. The social media manager of the royal household will have to find "new ways to maintain the Queen's presence in the public eye and on the world stage" says the job listing website.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X