For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌదీలో డ్రోన్ దాడులతో పెరిగిన క్రూడ్ ధరలు

|

రియాద్ : సౌదీ అరేబియాకు చెందిన రెండు ఆయిల్ పంపింగ్ కేంద్రాలపై డ్రోన్ దాడులు క్రూడాయిల్ ధరలపై ప్రభావం చూపాయి. సౌదీ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ధరలు అమాంత పెరిగిపోయాయి. ఈ పరిణామం సౌదీ నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలన్నింటిపైగా ప్రభావం చూపింది. సౌదీలో దాడి అనంతరం అమెరికాలో క్రూడాయిల్ రేటు ఒక్కసారిగా 1.4శాతం మేర పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 1.6శాతం ఎగబాకింది.

సౌదీ అరేబియాకు కలిసొచ్చిన కాలం.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం..సౌదీ అరేబియాకు కలిసొచ్చిన కాలం.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ప్రభావం..

ప్రపంచ చమురు సరఫరాను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు జరిపాయి. అరేబియన్ గల్ఫ్ దేశాలపై తాజాగా జరిగిన ఉగ్రదాడి, కేవలం సౌదీ అరేబియానే కాక ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపింది. డ్రోన్ దాడుల అనంతరం సౌదీ తూర్పున ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ నుంచి రెడ్ సీ పోర్టు వరకు పైప్ లైన్ ద్వారా క్రూడాయిల్ సప్లై నిలిపివేసింది. ఈ పైప్‌లైన్ ద్వారా రోజుకు 50లక్షల బ్యారెళ్ల ముడి చమురు సప్లై జరుగోతంది.

Oil Opens Higher After Drone attacks on Saudi

డ్రోన్ దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా క్రూడాయిల్ సప్లై నిలిపివేశామని సౌదీ ప్రకటించింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని స్పష్టం చేసింది. పరిస్థితి సమీక్షించిన అనంతరం ముడి చమురు సరఫరా పునరుద్ధరిస్తామని ప్రకటించింది. అప్పటి వరకు క్రూడ్ ధరలు కొంతమేర పెరగవచ్చని చెప్పింది.

Read more about: business crude oil
English summary

సౌదీలో డ్రోన్ దాడులతో పెరిగిన క్రూడ్ ధరలు | Oil Opens Higher After Drone attacks on Saudi

Two pumping stations on a Saudi Aramco oil pipeline in Saudi Arabia were attacked by explosive-laden drones in the early morning local time on Tuesday, the official Saudi Press Agency reported, citing Saudi Energy Minister Khalid al-Falih, who described the attack as one of “terrorism and sabotage.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X