For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరెన్సీ విలువ తగ్గించుకున్న చైనా: అమెరికా టారిఫ్‌పై అనూహ్య నిర్ణయం, ఎందుకంటే?

|

అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం సాగుతోంది. వచ్చే నెలలో చర్చలు ఉంటాయని ఓ వైపు చెబుతూనే, మరోవైపు ఒకరి దిగుమతులపై మరొకరు పోటాపోటీగా టారిఫ్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అమెరికా 10 శాతం నుంచి 25 శాతం వరకు టారిఫ్ విధించింది. మరో 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై విధించేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో చైనా 60 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై అదే స్థాయిలో టారిఫ్ విధించింది. అమెరికా, చైనాలు మాటల యుద్ధానికి కూడా దిగాయి.

మీ సమీపంలోని ఆధార్ కార్డు సెంటర్ ఇలా తెలుసుకోవచ్చుమీ సమీపంలోని ఆధార్ కార్డు సెంటర్ ఇలా తెలుసుకోవచ్చు

చైనా పకడ్బందీ వ్యూహం

చైనా పకడ్బందీ వ్యూహం

ఓ వైపు అమెరికాకు ధీటుగా టారిఫ్ పెంచిన చైనా మంగళవారం నాడు మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది. డాలర్‌తో యువాన్ (చైనా కరెన్సీ) విలువను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 0.6 శాతానికి తగ్గించింది. దీంతో డాలర్ విలువ 6.8365 యువాన్లకు సమానమైంది. అంతకుముందు ఇది 6.7954గా ఉంది. ట్రేడ్ వార్ నేపథ్యంలో తమ కరెన్సీ వ్యాల్యూని తగ్గించడం ద్వారా చైనా.. అమెరికాపై తనదైన శైలిలో యుద్ధం చేస్తోంది. ఇది రిస్క్‌తో కూడిన నిర్ణయం. చైనా నిర్ణయం చాలా దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. చైనా ఇంపోర్ట్స్ పైన కూడా ప్రభావం చూపనుంది. చైనా ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చైనా తన అప్పులను (విదేశాలకు చెల్లించాల్సినవి) డాలర్ల రూపంలో చెల్లించాలి. అప్పుడు ఇది సమస్యగా మారుతుంది.

డిమాండ్ పడిపోకుండా వ్యూహం

డిమాండ్ పడిపోకుండా వ్యూహం

చైనా తన యువాన్ విలువను తగ్గించుకోవడానికి ముఖ్య కారణం... అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై టారిఫ్ ఉంది. దీంతో అక్కడ ఈ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. టారిఫ్ కారణంగా ధరలు పెరిగితే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇది చైనా ఎక్స్‌పోర్ట్స్ పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే డాలర్‌తో పోలిస్తే యువాన్ విలువను 0.6 శాతం తగ్గించింది. ఇలా చేయడం వల్ల తక్కువ డాలర్లతో ఎక్కువ చైనా వస్తువులు లభిస్తాయి. దీంతో డిమాండ్ పడిపోదు. అవసరమైతే ఇతర మార్కెట్లలో చైనా వస్తువులు మరింత తక్కువ ధరకు వస్తాయి. దీని వల్ల డిమాండ్మరింత పెరుగుతుంది. ఇది చైనాకు కలిసి వస్తుంది. కానీ చైనాను చూసి ఇతర దేశాలు కూడా కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇది లాభిస్తుందా

ఇది లాభిస్తుందా

చైనా తన కరెన్సీ విలువను తగ్గించడం వల్ల డ్రాగన్ కంట్రీ ఎగుమతులు చవకగా మారి, పెరుగుతాయి. దిగుమతులు మరింత ఖరీదు అవుతాయి. తమ వాణిజ్య లోటు తగ్గించుకునేందుకు చైనాకు ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు, దేశీయంగా సావరీన్ బాండ్లపై చెల్లించాల్సిన భారం తగ్గుతుంది. కానీ బయటకు ఇవ్వాల్సిన డాలర్ల కొనుగోలుకు మాత్రం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాకు గట్టి షాకిస్తూ, పైచేయి సాధించాలన్న చైనాకు ఇది ఎంతమేర లాభిస్తుందో చూడాలి.

English summary

కరెన్సీ విలువ తగ్గించుకున్న చైనా: అమెరికా టారిఫ్‌పై అనూహ్య నిర్ణయం, ఎందుకంటే? | Trade war with US: Chinese Central Bank devalues Yuan by 0.6%

The People's Bank of China said on tuesday it had decided to devalue the yuan's exchange rate to the US dollar by 0.6 percent amid the ongoing trade war with the US.
Story first published: Tuesday, May 14, 2019, 17:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X