For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలతో వారం ప్రారంభం: ఐటీ మినహా అన్ని రంగాలూ నీరసమే

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభంలో మళ్లీ దిగాలుపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాలకు తోడు దేశీయంగా లాభాల స్వీకరణ కూడా మార్కెట్లను పడదోసింది. ప్రారంభంలోనే నష్టాలతో మొదలుపెట్టిన సూచీలు మిడ్ సెషన్ తర్వాత మరింత నీరసించాయి. ఇంట్రాడేలో 11571 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నిఫ్టీ.. ఆఖర్లో కొద్దిగా కోలుకున్నా 11600 పాయింట్ల మార్క్ దిగువనే ముగిసింది. చివరకు 363 పాయింట్ల నష్టంతో 38600 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 11598 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 335 పాయింట్లు దిగొచ్చి 29618 వద్ద ఆగింది.

మారుతి సుజుకీ, టాటా మోటార్స్: డీజిల్ కార్ల బంద్‌కు కారణాలెన్మారుతి సుజుకీ, టాటా మోటార్స్: డీజిల్ కార్ల బంద్‌కు కారణాలెన్

బిపిసిఎల్, టీసీఎస్, ఐటీసీ, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, యెస్ బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ లూజర్స్ జాబితాలో చేరాయి.

Sensex tumbles 363 pts, Nifty below 11,600

ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని సెక్టోరల్ సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. ప్రధానంగా రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్స్, మీడియా, మెటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి అధికమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.30 శాతం కోల్పోయింది. అడ్వాన్స్ - డిక్లైన్ జాబితా చూసుకున్నా బేర్స్‌ మార్కెట్‌పై తమ పట్టును సాధించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

మెటల్స్‌లో మళ్లీ మంటలు

చైనా నుంచి వస్తున్న నెగిటివ్ న్యూస్ నేపధ్యంలో మెటల్ రంగ షేర్లలో గత కొద్దికాలం నుంచి సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2 శాతానికిపైగానే కోల్పోయింది. జిందాల్ స్టీల్స్ 5 శాతం, జెఎస్‌డబ్ల్యు స్టీల్ 4 శాతం నష్టపోయాయి. ఎన్ఎండిసి, సెయిల్, హిందాల్కో, నాల్కో వంటి స్టాక్స్ 2 నుంచి 4 శాతం వరకూ కోల్పోయాయి. మరికొద్దికాలం పాటు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆయిల్ షేర్లు కోలుకున్నాయ్

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త కూల్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ 3 శాతం తగ్గి 69 డాలర్‌కు చేరాయి. దీంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు కాస్త తేరుకున్నాయి. గత ఒకటి రెండు వారాలుగా నీరసంగా ఉన్న స్టాక్స్ ఈ రోజు రికవర్ అయ్యాయి. బిపిసిఎల్ 2.5 శాతం, హిందుస్తాన్ పెట్రోలియం 2.7 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అర శాతం వరకూ పెరిగాయి.

క్యాడిలా కరుగుతోంది

ఫార్మా సంస్థ క్యాడిలా స్టాక్ 2015 స్థాయిలకు పడిపోయింది. సంస్థకు చెందిన అహ్మాదాబాద్ ప్లాంట్‌ను తనిఖీలు చేసిన యూఎస్‌ ఎఫ్‌.డి.ఏ 14 లోపాలను గుర్తించింది. దీంతో ఈ స్టాక్ మరింతగా కుంగింది. ఇంట్రాడేలో రూ.293 స్థాయికి పడిపోయిన స్టాక్ చివర్లో కొద్దిగా తేరుకుని 1 శాతం పెరిగింది. రూ.308 దగ్గర క్లోజైంది.

టైటాన్‌ను అనూహ్య సెల్ ఆఫ్

రిజల్ట్స్‌కు ముందు టైటాన్ స్టాక్ అనూహ్యంగా పతనమైంది. గత కొద్ది కాలం నుంచి బాగా లాభాలతో ట్రేడవుతూ వస్తున్న స్టాక్‌లో ప్రాఫిట్ బుకింగ్ నమోదైంది. స్పష్టమైన కారణం ఏదీ తెలియకపోయినప్పటికీ టైటాన్ స్టాక్ కుంగింది. ఇంట్రాడేలో రూ.1083 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో మరో నిఫ్టీ స్టాక్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కుప్పకూలింది. ఏకంగా 6 శాతం పతనమైంది. చివరకు రూ.388 దగ్గర క్లోజైంది.
మరో నిఫ్టీ స్టాక్ టాటా మోటార్స్ కూడా 4.5 శాతం వరకూ నీరసించింది. చిన్న డీజిల్ కార్లను దశలవారీగా ప్రొడక్షన్ నుంచి తొలగించబోతోందనే వార్తల నేపధ్యంలో ఈ స్టాక్ పడింది.

వాల్యూమ్ గెయినర్స్

సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ స్టాక్ ఏకంగా 16 శాతం వరకూ పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా సాధారణంతో పోలిస్తే 13 రెట్లు పెరిగాయి. స్టాక్ చివరకు 12 శాతం పెరిగి రూ.920 దగ్గర క్లోజైంది.

దీపక్ నైట్రేట్ స్టాక్ 10 శాతానికిపైగా ఇంట్రాడేలో పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా 20 రెట్లు పెరిగాయి. స్టాక్స్ చివరకు 4.5 శాతం పెరిగి రూ.286 దగ్గర ముగిసింది.
టాటా కెమికల్స్ స్టాక్ ఇంట్రాడేలో 10 శాతం వరకూ పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా 10 రెట్లు పెరిగాయి. చివరకు రూ. 605 దగ్గర స్టాక్ క్లోజైంది.

English summary

నష్టాలతో వారం ప్రారంభం: ఐటీ మినహా అన్ని రంగాలూ నీరసమే | Sensex tumbles 363 pts, Nifty below 11,600

The S&P BSE Sensex ended the day 363 points, or 0.93 per cent, lower at 38,600, with YES Bank, Tata Motors, Bajaj Finance, Tata Steel, and HDFC among the top losers. Only five of the 30 constituents of the BSE were in green.
Story first published: Monday, May 6, 2019, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X