For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్‌కార్ట్, పేటిఎం సాధించనిది రిలయన్స్ ద్వారా సుసాధ్యం!: 100 సేవలతో సూపర్ యాప్!

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. వరల్డ్ లార్జెస్ట్ ఆన్‌లైన్ టు ఆఫ్ లైన్ సరికొత్త ఈ కామర్స్ ప్లాట్ ఫారం తీసుకు రానుంది. తద్వారా అమెజాన్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్‌లకు షాకివ్వనుంది. ఈ సూపర్ యాప్ పైన రిలయన్స్ జియో వర్క్ చేస్తోంది. ఇందులో 100 సర్వీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి. జియోకు 30 కోట్ల మంది సబ్‌స్కైబర్స్ ఉన్నారు. దీని సహాయంతో ఎక్కువ మందికి చేరువ చేయాలని యోచిస్తోంది.

<strong>ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డుతో డబ్బులు తీస్తున్నారా?</strong>ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డుతో డబ్బులు తీస్తున్నారా?

 ఒకే ప్లాట్ ఫాంపైకి ఎన్నో సేవలు

ఒకే ప్లాట్ ఫాంపైకి ఎన్నో సేవలు

ఆన్‌లైన్-సంప్రదాయ దుకాణాలను అనుసంధానం చేసేలా, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ ఫాంను రిలయన్స్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తోంది. ఈ సూపర్ యాప్‌లో ఈ-కామర్స్ సేవలు, ఆన్‌లైన్ బుకింగ్, చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వందకు పైగా సేవలు ఈ ప్లాట్ ఫాం ద్వారా అందిస్తారు. తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ ఇవ్వడం ద్వారా జియో రూపంలో రిలయన్స్ మరింత పవర్‌ఫుల్‌గా ఎదిగింది.

 రిలయన్స్ సూపర్ యాప్

రిలయన్స్ సూపర్ యాప్

రిలయన్స్ తీసుకు వచ్చే సూపర్ యాప్ ద్వారా ఈ-కామర్స్, ఆన్‌లైన్ బుకింగ్స్, పేమెంట్స్ అన్నీ కూడా ఒకే ప్లాట్ ఫాం ద్వారా చేసుకోవచ్చు. 2017లో దేశీయ ఈ-కామర్స్ విపణిస్థాయి కంటే 2021 నాటికి దాదాపు నాలుగు రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ-కామర్స్ ద్వారా 3 కోట్ల మంది వ్యాపారులను అనుసంధానించాలనేది ముఖేష్ అంబానీ టార్గెట్. రిలయన్స్ జియోతో పాటు పలు టెక్ సంస్థలను కొనుగోలు చేయడం, కొన్నింట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు త్వరలో ప్రారంభమయ్యే గిగా ఫైబర్ సేవలు (దీని ద్వారా గృహ, కార్యాలయ, వాణిజ్య సంస్థలకు అధిక వేగం డేటా ద్వారా పూర్తిస్థాయి వినోద సేవలు ఇవ్వనున్నారు) ఈ సూపర్ యాప్‌కు ఉపయోగపడనున్నాయి.

 ఫ్లిప్‌కార్డ్, పేటీఎం సాధించలేనిది

ఫ్లిప్‌కార్డ్, పేటీఎం సాధించలేనిది

రిలయన్స్ జియో నెట్ వర్క్ సామర్థ్యం అండగా ఉండటంతో ఈ సూపర్ యాప్.. చైనాకు చెందిన వియ్ చాట్ స్థాయి యాప్ మన దేశం నుంచి ఆవిర్భావించినట్లు అవుతుందని అంటున్నారు. ఈ ఘనతను సాధించడంలో స్నాప్‌డీల్, పేటీఎం, ఫ్రీచార్జ్, ఫ్లిప్‌కార్ట్, హైక్ వంటివి కూడా ఫెయిలయ్యాయి. ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌ సేవలను కూడా అనుసంధానించే అవకాశం ఈ సూపర్ యాప్‌ ద్వారా కలుగుతుందని, అన్ని సేవలు ఒకేచోట లభ్యమవుతాయని చెబుతున్నారు.

English summary

ఫ్లిప్‌కార్ట్, పేటిఎం సాధించనిది రిలయన్స్ ద్వారా సుసాధ్యం!: 100 సేవలతో సూపర్ యాప్! | Super app to place Reliance Jio in pole position

As Mukesh Ambani, Chairman and Managing Director, Reliance Industries, prepares to officially launch world's largest online-to-offline new e-commerce platform and give jitters to Amazon and Walmart-Flipkart, Reliance Jio is reportedly working on a "super app" that will provide over 100 services at one platform.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X