For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర: హైదరాబాద్, విజయవాడ ధరలు ఇలా

|

పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ, ముంబైలలో పెట్రోల్ ధర స్వల్పంగా 6 పైసలు తగ్గింది. డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. ఏప్రిల్ 21వ తేదీ తర్వాత ఈ రేట్లు తగ్గడం ఇది మొదటిసారి. ఇప్పటి వరకు ఇవి యథాతథంగా ఉన్నాయి. హైదరాబాదులో పెట్రోల్ ధర 8 పైసలు తగ్గింది. దీంతో ధర రూ.77.47 పైసలుగా ఉంది. డీజిల్ ధర 6 పైసలు క్షీణించి రూ.72.42 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణం. అమరావతిలో పెట్రోల్ ధర 9 పైసలు తగ్గి రూ.77.17, డీజిల్ ధర 5 పైసలు తగ్గి రూ.66.66గా ఉంది. విజయవాడలో పెట్రోల్ 76.82, డీజిల్ రూ.71.44గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 73.07, ముంబైలో 78.64, ఢిల్లీలో డీజిల్ ధర 66.66, ముంబైలో రూ.69.77గా ఉంది. కోల్‌కతా, చెన్నైలో పెట్రోల్ ధరలు రూ.75.08, రూ.75.84, డీజిల్ ధరలు కోల్‌కతాలో రూ.68.39, పెట్రోల్ ధరలు రూ.70.39గా ఉంది.

Petrol, Diesel prices lowered marginally. Check rates here

పెరిగిన ఎల్పీజీ ధరలు

సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్బీజీ) ధర బుధవారం ఒక్కో సిలిండర్‌పై 28 పైసల చొప్పున పెరిగింది. 2014వ సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దీని ధర ఒక్కో సిలిండర్‌పై రూ. 82కి పైగా పెరిగింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర 2.5 శాతం పెరిగింది. ఈ ధర పెరగడం ఇది వరుసగా మూడో నెల. ప్రపంచ మార్కెట్లో ఉన్న అధిక ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు పెరిగాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జారీ చేసిన ధరల నోటిఫికేషన్ పేర్కొంది.

<strong>పాన్-ఆధార్ లింక్ చేయలేదా, నష్టపోతారు జాగ్రత్త!</strong>పాన్-ఆధార్ లింక్ చేయలేదా, నష్టపోతారు జాగ్రత్త!

ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్‌కు రూ. 1,595.63 చొప్పున పెరిగి, రూ.65,067.85కి చేరుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నాటి ధరలతో పోలిస్తే ఏటీఎఫ్ ధర కిలో లీటర్‌కు రూ.677.1 చొప్పున పెరిగింది. మార్చి ఒకటో తేదీ నాటి ధరలతో పోలిస్తే భారీగా 8.1 శాతం పెరిగింది. ఎల్పీజీ ధర ఒక్కో సిలిండర్‌పై 28 పైసల చొప్పున పెరిగింది. నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ ధర ఒక్కో సిలిండర్‌పై రూ.6చొప్పున పెరిగింది.

English summary

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర: హైదరాబాద్, విజయవాడ ధరలు ఇలా | Petrol, Diesel prices lowered marginally. Check rates here

Domestic petrol and diesel prices were lowered marginally on Thursday. While the prices of petrol in Delhi and Mumbai were lowered by 6 paise per litre compared to the previous day's rates, those of diesel were cut by 5 paise per litre and 6 paise per litre respectively, data from Indian Oil Corporation showed.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X