For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌కు చమురు ధరల పెరుగుదల ఆందోళనకరమే: ఇతర ప్రమాదాలు విస్మరించవద్దు!

|

మన దేశ అవసరాల నిమిత్తం సింహభాగం చమురు దిగుమతులు వచ్చేది సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ దేశాల నుండే. ఇలాంటి ఆయిల్ ధరలు పెరుగుదల మనకు గుడ్ న్యూస్ ఏమీ కాదు. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75 డాలర్లుగా ఉంది. ఇది మార్కెట్ వర్గాలలో ఆందోళనను కలుగజేస్తోంది. ఆయిల్ ధరల ఆందోళన మార్కెట్ పైన పడుతోంది. ఓ వైపు ఆయిల్ ధరల పెరుగుదల, మరోవైపు సార్వత్రిక ఎన్నికల ప్రభావం మార్కెట్ల పైన పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70కి చేరువలో ఉంది.

చమురు ధరలు బ్యారెల్‌కు 72.15 డాలర్లకు తగ్గినప్పటికీ ఈ ఏడాదిలో ఇది 34 శాతం అధికమని గమనించాలి. ఆకట్టుకోలేని కార్పోరేట్ ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడం, డొమెస్టిక్ కన్సంప్షన్ తక్కువ కావడం, మాన్సూన్ ప్రభావానికి తోడు చమురు ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.

రైతులపై కేసు, పెప్సికోకు చిక్కులు?రైతులపై కేసు, పెప్సికోకు చిక్కులు?

 High crude oil prices just one worry for India; let’s not ignore the other risks

ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లు డైలమాలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది ఎస్ అండ్ పీ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగింది. ఈ ఏడాది 8.21 శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ స్ట్రగుల్‌లో ఉంది.

అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లు ఇప్పుడు జియో పొలిటికల్ రిస్క్‌లో ఉన్నాయని (ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే), అంటే అంతర్జాతీయ చమురు మార్కెట్ అస్థిరత ఎక్కువగా ఉంటుందని, ముడి చమురు ధరలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. చమురు షార్టేజ్ ఆందోళనలు ఉన్నాయని చెబుతున్నారు. లిబియా చమురు ఉత్పత్తిలో సుమారు 1.1 మిలియన్ బీఎంల పాక్షిక అంతరాయం కూడా క్రూడ్ ఆయిల్ ధరలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇరాన్ నుంచి దిగుమతులు చేసుకోవద్దని అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో సౌదీ అరేబీయా, ఇతర ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (Opec) దేశాలు ఈ నష్టాన్ని భర్తీ చేస్తాయా అనేది ఆసక్తికరమని అంటున్నారు. ఇటీవల ఒపెక్ దేశాల ఉత్పత్తి కూడా క్షీణించిందని చార్ట్ చెబుతోందని అంటున్నారు.

ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవద్దని భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు అమెరికా గత ఏడాది నవంబర్ నెలలో ఆరు నెలల గడువు విధించిన విషయం తెలిసిందే. మే 2వ తేదీ లోపు ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ దిగుమతులు జీరో చేసుకోవాలని ఇటీవలే మరోసారి స్పష్టం చేసింది.

భారత్‌కు చమురు క్రిటికల్ కమోడిటీ. చమురు ధరల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. ఆర్థిక గణన, ద్రవ్యోల్భణం, ఫైనాన్షియల్ మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది. ఎక్స్‌టర్నల్ పాలసీలు ఆయిల్ ధరలను నియంత్రిస్తాయి. దీనిపై ఏ ఒక్కరూ ఏమీ చేయలేరు. వచ్చే నెల (మే 23న ఎన్నికల ఫలితాలు) కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుంది. దీనిపై అందరి దృష్టి ఉంది. మార్కెట్ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముందుకు సాగడం అంత సులభమేమీ కాదని అంటున్నారు.

English summary

భారత్‌కు చమురు ధరల పెరుగుదల ఆందోళనకరమే: ఇతర ప్రమాదాలు విస్మరించవద్దు! | High crude oil prices just one worry for India; let’s not ignore the other risks

For a country that imports the lion’s share of its oil requirements, high prices are never good news. So, when Brent crude prices rose to over $75 a barrel, there was some worry on the Street.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X