For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఖరి రోజు, ఆఖరి గంటలో దెబ్బేసింది ! భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్

By Chanakya
|

షార్ట్ కవరింగ్, లాంగ్ అన్‌వైండింగ్, ఎఫ్ అండ్ ఓ ఏప్రిల్ ఎక్స్‌పైరీ వంటివన్నీ కలిసి ఈ రోజు మార్కెట్లను కూలదోశాయి. నిఫ్టీ 200 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 500 పాయింట్లు ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి పతనం కావటం ప్రధానంగా గమనించాల్సిన అంశం. నిన్న ఆఖరి గంటలో అమ్మకాలు అనూహ్యంగా వస్తే.. ఈ రోజు మాత్రం ట్రెండ్ రివర్స్ అయింది. నిఫ్టీ ఏప్రిల్ సిరీస్‌ 11700 పాయింట్ల దిగువన ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 30000 పాయింట్ల కింద క్లోజైంది. ఒక్క రియాల్టీ మినహా అన్ని రంగాల్లోనూ సెల్లింగ్ ప్రెషర్ నమోదైంది. ప్రధానంగా మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసిజి, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఎక్కువ ఒత్తడికి లోనయ్యాయి. చివరకు సెన్సెక్స్ 324 పాయింట్ల నష్టంతో 38730 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 11642 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు పతనమై 29561 దగ్గర ఆగింది.

అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిం, బిపిసిఎల్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, వేదాంతా, ఇండియాబుల్స్ హౌసింగ్, హిందాల్కో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.

మారుతి స్పీడ్ తగ్గింది

ప్రముఖ ప్యాసింజర్ ఫోర్ వీలర్ సంస్థ మారుతి సుజుకి మార్చితో ముగిసిన క్వార్టర్లో నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సంస్థ నికరలాభం 5 శాతం క్షీణించగా, ఆదాయంలో కేవలం 1.4 శాతమే వృద్ధి నమోదైంది. ఎబిటా మార్జిన్స్ 3.6 శాతం తగ్గడం మరింత ఒత్తిడి పెంచింది. దీంతో స్టాక్ రూ.7000 దిగువకు పడిపోయింది. చివరకు 1.73 శాతం నష్టంతో రూ.6902 దగ్గర క్లోజైంది.

రిలయన్స్ రికార్డ్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో రోజు కూడా లాభపడినప్పటికీ ఆఖర్లో మాత్రం నిరుత్సాహపరిచింది. లైఫ్ టైం హై మార్క్ రూ.1412.40ని టచ్ చేసిన స్టాక్ ఆఖర్లో మాత్రం మార్కెట్ ఎఫెక్ట్‌తో డీలాపడింది. చివరకు 1.23 శాతం నష్టంతో రూ.1372.40 దగ్గర క్లోజైంది.

Markets Update: Sensex, Nifty end in red

ఇన్ఫ్రాటెల్‌కు సిఎల్ఎస్ఏ దెబ్బ

టెలికాం టవర్ ఆపరేటర్ సంస్థ... భారతీ ఇన్ఫ్రాటెల్ సంస్థను డౌన్ గ్రేడ్ చేస్తూ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ నిర్ణయం తీసుకుంది. తాను గతంలో ఇచ్చిన ఔట్‌పర్ఫార్మ్ రేటింగ్‌ను సెల్‌కు మార్చడంతో పాటు టార్గెట్‌ను రూ.285కి తగ్గించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఈ నిఫ్టీ స్టాక్ ఏకంగా 10 శాతానికిపైగా పతనమైంది. చివరకు 10.33 శాతం లాస్‌తో రూ.271 దగ్గర ముగిసింది.

అల్ట్రాటెక్ పటిష్ట లాభాలు

మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో సిమెంట్ సంస్థ అల్ట్రాటెక్ స్టాక్ లైఫ్ టైం గరిష్ట స్థాయిని తాకింది. వాల్యూమ్స్‌తో సహా స్టాక్ పెరిగింది. చివరకు స్టాక్ 4.2 శాతం లాభపడి రూ.4622.30 దగ్గర క్లోజైంది.
నిన్న ఏసిసి రిజల్ట్స్ కూడా కాస్త పాజిటివ్‌గా రావడంతో ఈ రోజు ఈ సెగ్మెంట్లో ఉన్న అన్నీ మినీ, మేజర్ సిమెంట్ స్టాక్స్ అన్నీ భారీగా లాభపడ్డాయి. డెక్కన్ సిమెంట్స్ 9 శాతం, సౌరాష్ట్ర 5 శాతం, ఓరియంట్ సిమెంట్స్ 6 శాతం, జెకె సిమెంట్స్ - రాంకో సిమెంట్స్ 4 శాతం వరకూ పెరిగాయి.

షుగర్ లాభాల తీపి

చెరకు ఉత్పత్తి తక్కువగా ఉండడం, చక్కెర రేట్లు పెరిగే అవకాశం ఉండడంతో షుగర్ కంపెనీల షేర్లు లాభాల బాటపట్టాయి. ఈ సారి విడుదలయ్యే ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చనే అంచనాలతో ఈ షేర్లు తీపిని పంచాయి. ధంపూర్ షుగర్స్ 5 శాతం, శ్రీ రేణుకా 4 శాతం, ఉత్తమ్ షుగర్స్ 9 శాతం, అవధ్ షుగర్స్ 4 శాతం పెరిగాయి.

మే సిరీస్ కీలకం

మే నెలలో ఎన్నికల ఫలితాలొస్తాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేలనుంది. ఒక వేళ బిజెపికి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా మార్కెట్లు డీలా పడే అవకాశం ఉంది. అందుకే వచ్చే సిరీస్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి.

English summary

ఆఖరి రోజు, ఆఖరి గంటలో దెబ్బేసింది ! భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్ | Markets Update: Sensex, Nifty end in red

Indian equity benchmarks ended lower pressured by heavy selling in final hour of trade and losses in metal stocks.
Story first published: Thursday, April 25, 2019, 17:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X