For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమిత్ షా, రాహుల్ గాంధీలు షేర్ మార్కెట్, మ్యుచువల్ ఫండ్స్ కింగ్స్!: ఎంత షేర్లు ఉన్నాయంటే?

|

అమిత్ షా, రాహుల్ గాంధీ రాజకీయ ప్రత్యర్థులు. షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాగా, రాహుల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధినేత. వీరిరువురు వ్యాపారంపై ఆసక్తి కలిగిన నేతలు. స్టాక్ మార్కెట్ సంబంధిత లావాదేవీల్లో ఉన్నారు. వీరిద్దరు లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత అమేథితో పాటు వయనాడ్ నుంచి పోటీ చేస్తే, బీజేపీ చీఫ్ గాంధీ నగర్ నుంచి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో వారు తమకు చెందిన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో సమర్పించారు. పలు సంస్థల్లో, మ్యుచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు ఉన్నట్లు పేర్కొన్నారు.

<strong>ఉద్యోగుల తొలగింపు లేదు, రిటైర్మెంట్ వయస్సు తగ్గించరు!</strong>ఉద్యోగుల తొలగింపు లేదు, రిటైర్మెంట్ వయస్సు తగ్గించరు!

 వివిధ కార్పోరేట్ సంస్థల్లో అమిత్ షా షేర్లు

వివిధ కార్పోరేట్ సంస్థల్లో అమిత్ షా షేర్లు

క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు అమిత్ షా ఓ ప్రొఫెషనల్ స్టాక్ బ్రోకర్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడే (ఆర్‌ఐఎల్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), బజాజ్ ఆటో, కోల్గేట్ పామోలివ్, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), లార్సెన్ అండ్ టూబ్రో ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఇలా వందలాది లిస్టింగ్, అన్‌లిస్టింగ్ షేర్లను అమిత్ షా కలిగి ఉన్నారు. గత నెల 22వ తేదీ నాటికి తనకు ఆయా సంస్థల్లో రూ.17.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లలో లేని సంస్థల్లో రూ.3.08 లక్షల విలువైన వాటాలు ఉన్నట్లు తెలిపారు. ఇక, తన సతీమణి సోనాల్ షా పేరిట రూ.4.35 కోట్ల షేర్లున్నాయని, అన్‌లిస్టింగ్ షేర్లు రూ.1.58 లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం తన ఆస్తులు రూ. 30.49 కోట్లుగా, తన భార్య ఆస్తులు రూ.8.35 కోట్లుగా పేర్కొన్నారు.

 పెట్టుబడులు

పెట్టుబడులు

అమిత్ షా ఎక్కువగా మిడ్ క్యాప్ స్టాక్స్‌లోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. అయినప్పటికీ ఎస్బీఐ, టీసీఎస్, ఆర్‌ఐఎల్, టాటా మోటార్స్, నెస్లే, ఎల్ అండ్ టీ, మారుతి, హిండాల్కో, ఐటీసీ, హెచ్‌యూఎల్ వంటి భారీ షేర్లలోనూ పెట్టుబడులు ఉన్నాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ సంస్థల్లో అమిత్ షా పెట్టుబడులు లేవు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోం ఫైనాన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో స్వల్పంగా లక్ష రూపాయలకు పైగా పెట్టుబడులు ఉన్నాయి. ఈ సంస్థలలోనే అమిత్ షా సతీమణికి కూడా పెట్టుబడులు ఉన్నాయి. కొన్ని కొత్త షేర్లు ఆమె తరఫు పెట్టుబడుల్లో కనిపిస్తున్నాయి.

రాహుల్ గాంధీ ఆస్తులు

రాహుల్ గాంధీ ఆస్తులు

రాహుల్ గాంధీకి కూడా పది మ్యుచువల్ ఫండ్ స్కీముల్లో రూ.5.19 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లలోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కంటే మ్యూచువల్ ఫండ్స్‌కు రాహుల్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 10 మ్యుచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు ఉన్నాయి. కాగా, రాహుల్ గాంధీకి రూ.5.80 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో రూ.40,000 నగదు, బ్యాంక్స్ సేవింగ్స్‌లో రూ.17.93 లక్షలు, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో రూ.39.89 లక్షలు, రూ.2.91 లక్షల నగలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో రూ.10.08 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 72.1 లక్షల లయబిలిటీలు ఉన్నట్లు చెప్పారు.

English summary

అమిత్ షా, రాహుల్ గాంధీలు షేర్ మార్కెట్, మ్యుచువల్ ఫండ్స్ కింగ్స్!: ఎంత షేర్లు ఉన్నాయంటే? | Amit Shah has diversified stock investment portfolio, Rahul Gandhi prefers mutual funds

BJP President Amit Shah, who was a stock broker by profession before jumping into active politics, owns hundreds of listed and unlisted stocks, key among them being RIL, TCS, Bajaj Auto, Colgate Palmolive, Grasim, HUL, L&T Finance and UltraTech Cement, among others. Rahul Gandhi, president of the Congress Party, has equity exposure mainly through mutual funds.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X