For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ అప్‌డేట్స్: 11,700కు దిగువన నిఫ్టీ, 68.27 వద్ద ప్రారంభమైన రూపాయి

|

మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సెన్సెక్స్‌ 62 పాయింట్ల లాభంతో 38,934 వద్ద ట్రేడ్ అయింది.. అదే సమయంలో నిఫ్టీ 16 పాయింట్లు బలపడి 11,685 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.27 వద్ద ప్రారంభమై 68.28 వద్ద కొనసాగింది. పది గంటల సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్ల లాభాంతో 38,891 వద్ద, నిఫ్టీ 11,669 వద్ద ట్రేడ్ అయింది. మొత్తానికి ప్రారంభ లాభాలు ఆ తర్వాత కొనసాగలేదు.

<strong>ఈ నెల 18న నీరవ్ మోడీ లగ్జరీ కార్లు వేలం!</strong>ఈ నెల 18న నీరవ్ మోడీ లగ్జరీ కార్లు వేలం!

రెడ్డీస్ ల్యాబ్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇన్ ఫ్రా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. రిలయెన్స్ కమ్యూనికేషన్స్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, ఆంధ్రా బ్యాంకు, బజాజ్ ఎలక్ట్రానిక్స్, స్పైస్ జెట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

Markets updates: Sensex pares early gains, trades flat; Nifty below 11,700

కాగా, కొత్త ఆర్థిక సంవత్సరం దూకుడుగా ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో ఆర్బీఐ నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి తదితర కారణాల వల్ల మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. దీంతో 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం రోజునే (ఏప్రిల్‌ 1) బీఎస్ఈ సెన్సెక్స్‌, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలను తాకింది.

సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో తొలిసారి 39 వేల రికార్డ్ స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 11738 పాయింట్లను తాకింది. అయితే ఇండెక్స్‌లు ఇంట్రాడేలో సాధించిన ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలను చివరి వరకు నిలబెట్టుకోలేదు. చివరకు సెన్సెక్స్ 199 పాయింట్ల లాభంతో 38,872, నిఫ్టీ 11,669 వద్ద క్లోజ్ అయింది.

English summary

మార్కెట్ అప్‌డేట్స్: 11,700కు దిగువన నిఫ్టీ, 68.27 వద్ద ప్రారంభమైన రూపాయి | Markets updates: Sensex pares early gains, trades flat; Nifty below 11,700

The Sensex and Nifty dropped their early gains to trade weakly positive in the morning session on Tuesday. The Sensex was little changed at 38,891, up 19 points or 0.05 per cent, while the Nifty was at flat at 11,669.
Story first published: Tuesday, April 2, 2019, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X