For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైస్ జెట్ ఇంటర్వ్యూలకు జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇండిగో పైలట్ల ఆందోళన!

|

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. 119 విమానాలకు గాను కేవలం 41 విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. ఇందులో కూడా పలు విమానాలు ఎప్పుడైనా ఆగిపోవచ్చునని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విమాయాన సంస్థకు చెందిన పైలట్లు, ఇతర ఉద్యోగులు స్పైస్ జెట్ వైపు చూస్తున్నారట. ఈ కంపెనీలో ఉద్యోగాల కోసం వెళ్తున్నారట.

యాజమాన్య మార్పు: జెట్ ఎయిర్‍‌వేస్‌లో కొత్త పరిణామం, గట్టెక్కించేందుకు రుణదాతల ప్రయత్నంయాజమాన్య మార్పు: జెట్ ఎయిర్‍‌వేస్‌లో కొత్త పరిణామం, గట్టెక్కించేందుకు రుణదాతల ప్రయత్నం

 ఇండిగో తీసుకోవాలనున్నప్పటికీ

ఇండిగో తీసుకోవాలనున్నప్పటికీ

ఇంతకుముందు, జెట్ ఎయిర్‌వేస్ పైలట్లను ఇండిగో విమానయాన సంస్థ తీసుకోవాలని భావించింది. ఈ మేరకు ప్రయత్నాలు చేసింది. జెట్ ఎయిర్‌వేస్ పైలట్లకు ఆ కంపెనీ నుంచి రావాల్సిన పెండింగ్ శాలరీల పరిహారం, ఇతర ప్రయోజనాలతో తీసుకునేందుకు ఇండిగో సిద్ధపడింది. కానీ సొంత పైలట్ల నుంచి నిరసన వ్యక్తమైంది. కాక్ పిట్ క్రూ లేకపోవడంతో ఈ విమానయాన సంస్థ వందలాది విమానాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జెట్ పైలట్ల కోసం తలుపులు తెరిచింది.

 స్పైస్ జెట్ ఇంటర్వ్యూలకు జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు

స్పైస్ జెట్ ఇంటర్వ్యూలకు జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు

ఇదిలా ఉండగా, జెట్ ఎయిర్‌వైస్ పైలట్లకు స్పైస్ జెట్ కూడా తలుపులు తెరిచి పెట్టింది. గురుగ్రామ్‌లో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది తమ సంస్థ విస్తరణ కోసం కొత్త పైలట్ల కోసం చూస్తోంది. బుధవారం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. దాదాపు 260 మంది జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు ముంబైలోని తమ కార్యాలయానికి ఇంటర్వ్యూల కోసం వచ్చారని, ఇందులో 150 మంది కెప్టెన్లు ఉన్నారని స్పైస్ జెట్ వర్గాలు వెల్లడించాయి.

స్పైస్ జెట్ వద్ద బోయింగ్ విమానాలు

స్పైస్ జెట్ వద్ద బోయింగ్ విమానాలు

స్పైస్ జెట్ వద్ద బోయింగ్ 737 విమానాలు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు బోయింగ్ విమానాలకు ట్రెయిన్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ ఆ పైలట్ల వైపు చూస్తోంది. ఇండిగో కూడా జెట్ పైలట్లకు మంచి ఆఫర్ ఇస్తోంది. ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం జెట్ పైలట్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇండిగో సిద్ధమైంది. కానీ సొంత కంపెనీ పైలట్లు మాత్రం ఈ చర్యను అనైతికమైనదిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెట్ నుంచి వచ్చే వారికి రెండు నెలల వేతనం, ఇతర ప్రయోజనంతో పాటు అదే డిజిగ్నేషన్ ఇస్తామని చెబుతున్నారని, తద్వారా తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇండిగో పైలట్లు చెబుతున్నారట. అయితే ఇండిగో మేనేజ్‌మెంట్ వాదన మరోలా ఉందట. జెట్ ఎయిర్‌వేస్ నుంచి వచ్చే వారికి బోనస్ ఇవ్వడం కాదని, అక్కడ వారికి వేతనాలు రానందున పరిహారమని చెబుతున్నారట.

English summary

స్పైస్ జెట్ ఇంటర్వ్యూలకు జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇండిగో పైలట్ల ఆందోళన! | Jet pilots look to board SpiceJet as IndiGo captains seek to abort their entry

The harried pilots of Jet Airways, which is on the brink of shuttering operations, have now approached SpiceJet seeking employment.
Story first published: Thursday, March 21, 2019, 13:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X