For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్, నిఫ్టీ ఆరో రోజూ జోరు.. భారీ లాభాల్లో ప్రారంభం

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో రోజు కూడా పటిష్ట లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 11500 పాయింట్ల సెంటిమెంట్ మార్కును క్రాస్ చేసి ఉత్సాహంగా పైపైకి పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో పాటు భారీగా విదేశీ సంస్థలు నిధులు కుమ్మరించడం కూడా మార్కెట్లు పెరగడానికి దోహదపడ్తున్నాయి.

ఏ ఏ రంగాలు లాభాల్లో...

ఈ రోజు ట్రేడింగ్‌లో ఆటో, ఫార్మా రంగ స్టాక్స్‌లో కొద్దిగా నీరసం ఉంది. ఇవి కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కొనుగోళ్ల మద్దతు ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు అర శాతం వరకూ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నిఫ్టీ 500లో బాంబే డైయింగ్ 9 శాతం, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 8 శాతం, సుందరం ఫాస్ట్‌నర్స్ 6 శాతం, జస్ట్ డయల్ 5 శాతం, దివాన్ హోసింగ్ 5 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.

ఆదిత్యబిర్లాకు ఐటీ శాఖ నోటీస్ఆదిత్యబిర్లాకు ఐటీ శాఖ నోటీస్

Sensex Surges 300 Points Higher, Nifty Hits 11,500; Rupee At 7-Month High

ఇక నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్‌లో ఇండో కౌంట్ 7 శాతం, స్టెరిలైట్ టెక్ 6 శాతం, టిటికె ప్రెస్జేజ్ 5 శాతం, మన్‌పసంద్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, అదానీ ట్రాన్స్‌మిషన్, లుపిన్ స్టాక్స్ (4 శాతం) ఉన్నాయి.

అడ్వాన్స్ - డిక్లైన్ జాబితా చూస్తే 1.5 : 1 ఉంది. అంటే 15 స్టాక్స్ లాభాల్లో ఉంటే.. పది స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఈ లెక్కన సోమవారం రోజున ఇది పాజిటివ్ స్టార్ట్.

English summary

సెన్సెక్స్, నిఫ్టీ ఆరో రోజూ జోరు.. భారీ లాభాల్లో ప్రారంభం | Sensex Surges 300 Points Higher, Nifty Hits 11,500; Rupee At 7-Month High

Domestic equity benchmarks (Sensex and Nifty) surged along with the Indian rupee (INR) on the back of strong foreign fund inflows. The Nifty 50 index reclaimed its crucial psychological level of 11,500 as both the indexes continue to trade at over six month highs.
Story first published: Monday, March 18, 2019, 11:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X