For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇదీ కోటీశ్వరుడి పోర్ట్‌ఫోలియో...! నెలకు జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో..

By Chanakya
|

ప్రతీ ఒక్కరికీ కోటీశ్వరుడు కావాలనే కల ఉంటుంది. భారీగా డబ్బు కూడబెట్టి దాన్ని బ్యాంకులో వేసుకుని హ్యాపీగా కూర్చుని తినాలనుకుంటాం. కానీ అధిక శాతం మంది మధ్యలోనే ఆలక్ష్యాన్ని నిలుపుకోలేక చివరకు అత్తెరసు డబ్బుతోఅలా బతికేస్తాం. అయితే నెలకు రూ.10 వేల పెట్టుబడితో 20 ఏళ్లలో దాన్ని కోటి రూపాయలు చేసుకోగల అవకాశం ఉందనే విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

Turn your Rs.10000 SIP to Rs. 1crore portfolio with these expert tips.

క్రమశిక్షణ ముఖ్యం

ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. ఇంత సొమ్ము మన భవిష్యత్ లక్ష్యాల కోసం దాయాలి అనుకున్నప్పుడు అదే స్థాయిలో కమిట్‌మెంట్ ఉండాలి. ప్రతీ అవసరానికీ ఆ డబ్బులను తీసేస్తే.. ఇక కార్పస్ అనేదే ఉండదు. అందుకే ఎంత కష్టం వచ్చినా ఆర్థిక క్రమశిక్షణను మాత్రం తప్పొద్దు. మనలాంటి వాళ్లకోసమే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) అందుబాటులోకి వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో నిజంగా ఇదో బెస్ట్ ఆప్షన్.

నెలకు రూ.500 పెట్టుబడితో

క్రమానుగత పెట్టుబడితోనే మన లక్ష్యాలు సాధ్యపడతాయి. కనీసం నెలకు రూ.500 పెట్టుబడి కూడా మనకు రిటైర్మెంట్ సమయంలో చాలా అక్కరకు వస్తుంది. అయితే కోటి రూపాయల భారీ ప్లాన్ పెట్టుకున్నప్పుడు మాత్రం నెలకు రూ.10 వేలు తక్కువ లేకుండా పెట్టుబడి పెట్టుకోవాలి. అప్పుడే మన టార్గెట్ హిట్ అవుతుంది.

నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే..

నెలకు రూ.10 వేల చొప్పున 20 ఏళ్ల పాటు మనం పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ప్రతీ ఏటా దీనిపై 18 శాతం రాబడి వచ్చిందని పరిగణిద్దాం. అప్పుడు మనకు 20 ఏళ్ల తర్వాత చేతికి అందే మొత్తం రూ.99.9 లక్షలు (రూ.99,91,479). ఇక్కడ మనం ఏటా 6 శాతం ఇన్‌ఫ్లేషన్‌ను కూడా కన్సిడర్ చేశాం. ఇన్‌ఫ్లేషన్‌ ఇప్పుడు నాలుగు శాతానికే పరిమితమైంది కాబట్టి మనకు చేతికి అందే మొత్తం మరింత
పెరుగుతుంది.

18 శాతం పెట్టుబడి ఎలా సాధ్యం

వయస్సు తక్కువగా ఉన్నప్పటి నుంచే పెట్టుబడి మొదలుపెట్టాలి. అప్పుడు 80 శాతం వరకూ మన ఇన్వెస్ట్‌మెంట్‌ను ఈక్విటీల్లో పెట్టొచ్చు. వయస్సు 35-45 మధ్య ఉంటే 50 శాతం ఈక్విటీల్లో - 50 శాతం డెట్‌లో పెట్టుబడిపెట్టాలి. దీని వల్ల రిస్క్ తక్కువగా ఉండడంతో పాటు డైవర్సిఫై అవుతుంది.ఈక్విటీల్లో కూడా లార్జ్ క్యాప్, బ్లూచిప్ ఫండ్స్‌కు అధిక ప్రయార్టీ ఇవ్వాలి. అప్పుడే మన లక్ష్యాలను చేరుకోవచ్చు.

English summary

ఇదీ కోటీశ్వరుడి పోర్ట్‌ఫోలియో...! నెలకు జస్ట్ రూ.10 వేల పెట్టుబడితో.. | Turn your Rs.10000 SIP to Rs. 1crore portfolio with these expert tips.

Many would want to turn into a crore pati with short investments. But while investing one should know the facts and then invest.But many people in the long run are failing to keep up the investments.
Story first published: Saturday, March 16, 2019, 19:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X