For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ఐటి స్టాక్స్ వీక్

By Chanakya
|

భారత్ - పాక్ మధ్య వాతావరణం కొద్దిగా వేడెక్కిన నేపధ్యంలో స్టాక్ మార్కెట్ల సూచీలు ఈ ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా ప్రోత్సాహక సంకేతాలు రావడంతో నిఫ్టీ మళ్లీ 10900 పాయింట్ల మార్కును దాటింది. సర్జికల్ స్ట్రైక్స్ నేపధ్యంలో నిన్న భారీగా పతనమైన మార్కెట్లు ఈ రోజు అదే ఉత్సాహంతో కోలుకున్నాయి. ఒక్క ఐటి మినహా దాదాపు అన్ని రంగాల సూచీలూ లాభాల బాటలోనే కొనసాగుతున్నాయి.

బ్యాంకుల జోరు
ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్ ఇండెక్స్, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్, రియాల్టీ, ఆటో రంగ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పిసిఏ) నుంచి అలహాబాద్ బ్యాక్, కార్పొరేషన్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంకును ఆర్బీఐ పక్కకుతప్పించడంతో ఈ స్టాక్స్‌ జోరుమీదున్నాయి. అలహాబాద్ 5.5 శాతం, కార్పొరేషన్ 7.5 శాతం, ధనలక్ష్మి బ్యాంక్ 8.5 శాతం లాభాలతో ఉత్సాహంగా ఉరకలేస్తున్నాయి.

Stock markets opened in green with support from asian markets and american markets.

నిలకడగా రూపాయి
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై అంత ఉత్సాహం చూపకపోవడం కూడా మనలాంటి దేశాలకు కొద్దిగా కలిసొచ్చే అంశం. మరోవైపు జియో పొలిటికల్ టెన్ష్స్ వల్ల నిన్న కొద్దిగా నీరసించిన రూపాయి ఈ రోజు ఫ్లాట్‌గా ఉంది. బాండ్ మార్కెట్లో స్థిరత్వాన్ని తెచ్చేందుకు ఆర్బీఐ సుమారు రూ.25 వేల కోట్లతో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా బాండ్ల కొనుగోలు చేపడ్తోంది. ఇది కొత్తగా పాజిటివ్ అంశం.

చిన్న స్టాక్స్ జోరు
స్మాల్ క్యాప్ స్పేస్‌లో క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, పిజి జ్యువెలర్స్, నోసిల్, బోరోసిల్ గ్లాస్, టైం టెక్నోపలాస్ట్, ప్రిజం సిమెంట్ వంటి స్టాక్స్ 5 శాతానికి పైగా లాభపడ్డాయి. రాంకీ, న్యూలాండ్ ల్యాబ్స్ కూడా జోరుమీదున్నాయి.

English summary

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ఐటి స్టాక్స్ వీక్ | Stock markets opened in green with support from asian markets and american markets.

Stock markets opened in green with support from asian markets and american markets. Markets shrugged off geo political tensions between India and Pakistan
Story first published: Wednesday, February 27, 2019, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X