For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్ద ఇన్వెస్టర్లంతా ఈ స్టాక్స్ అమ్మేసుకుని బయటపడ్డారు.. మీ దగ్గర ఇంకా ఉన్నాయా..

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రాకేష్ జున్‌జున్‌వాలా, అనిల్ గోయెల్, డాలీ ఖన్నా, విజయ్ కెడియా, పొరింజు వెలియాత్, అశిష్ కచోలియా అంటే చిన్న మదుపర్లలో అమితమైన ఆసక్తి ఉంటుంది.

By bharath
|

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రాకేష్ జున్‌జున్‌వాలా, అనిల్ గోయెల్, డాలీ ఖన్నా, విజయ్ కెడియా, పొరింజు వెలియాత్, అశిష్ కచోలియా అంటే చిన్న మదుపర్లలో అమితమైన ఆసక్తి ఉంటుంది. వాళ్లు చెప్పిన స్టాక్స్ అన్నీ బుల్ మార్కెట్లో రాకెట్స్‌లా దూసుకుపోతుంటాయి. వాళ్లు ఏ స్టాక్ చెప్పినా.. వాళ్ల పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ బయటికి తెలిసినా వాటికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే అవన్నీ బుల్ మార్కెట్లో సూపర్‌గా సక్సెస్ అవుతాయి. కానీ ఇప్పుడు బొమ్మ తిరగపడింది.

పెద్ద ఇన్వెస్టర్లంతా ఈ స్టాక్స్ అమ్మేసుకుని బయటపడ్డారు.. మీ దగ్గర ఇంకా ఉన్నాయా..

బేర్‌మన్న స్టాక్స్
2018లో డ్రీమ్ రన్ సాగించిన సూచీలు ఏడాది ఆఖరికల్లా దిగాలు పడ్డాయి. దీంతో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలావరకూ చతికిలపడ్డాయి. కొన్ని సంస్థల్లోవాటాలు తగ్గించుకుంటే, మరికొన్నింటిలో మొత్తం వాటాలను నష్టాలతో అయినా అమ్ముకుని బయటపడ్డారు ఏస్ ఇన్వెస్టర్లు.

రాకేష్ జున్‌జున్‌వాలా లెక్క ఇదీ
బిగ్ బుల్‌గా, ఇండియన్ వారెన్ బఫెట్‌గా కీర్తించబడే రాకేష్ జున్‌జున్‌వాలా తన ఫేవరెట్ స్టాక్ అయిన టైటాన్‌లో 1.20 కోట్ల షేర్లను వదిలించుకున్నారు. సంస్థలో తనకు ఉన్న వాటాను 8.45 నుంచి 7.08 శాతానికి తగ్గించుకున్నారు. దీంతో పాటు ఎన్.సి.సి. ప్రొజోన్ ఇంటు, ర్యాలీస్ ఇండియా, లుపిన్‌లో కూడా వాటాలు తగ్గించుకున్నారు.

అనిల్ గోయెల్ హిట్స్ అండ్ మిసెస్
మరో ప్రముఖ ఇన్వెస్టర్ అనిల్ కుమార్ గోయెల్ తన పోర్ట్‌ఫోలియో నుంచి కాస్మో ఫిల్మ్స్, మెజిస్టిక్ ఆటో, పనామా పెట్రో, వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్‌ను తప్పించారు. వీటితో పాటు ఎల్ జి బాలక్రిష్ణన్, పంజాబ్ ఆల్కలీస్, శిల్ప్ గ్రావెర్స్ స్టాక్స్‌ను కూడా ఆయన తీసేసి ఉంటారని భావిస్తున్నారు.

ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియో
స్మాల్, మైక్రో క్యాప్స్‌ను ఎట్రాక్టివ్ వేల్యుయేషన్స్‌లో పట్టుకోవడం ఆశిష్ కచోలియా స్పెషాలిటీ. ఆయన చాలా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ తక్కువ వాటా వల్ల అవి షేర్ హోల్డర్స్ లిస్ట్‌లో అంతగా కనిపించవు. అయితే ఆయనకు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఆప్టెక్, బోడల్ కెమికల్స్, ఎస్టర్ ఇండస్ట్రీస్, జీటీపీఎల్ హాత్‌వే, శ్రేయస్ షిప్పింగ్, ఎస్పీ అపెరల్, వాడిలాల్ ఇండస్ట్రీస్‌లో వాటాలు ఉండేవి. ఇప్పుడు వీటిల్లో ఆయన చాలా వరకూ తన పొజిషన్స్‌ను తగ్గించుకున్నారు.
వీటికి అదనంగా పోకర్న, కెఈఐ ఇండస్ట్రీస్, పరాగ్ మిల్క్స్‌లో కూడా తన వాటాలను సగానికి సగం తగ్గించారు.

డాలీ ఖన్నా పోర్ట్‌ఫోలియో
చెన్నైకి చెందిన మరో ఏస్ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా తన పోర్ట్‌ఫోలియో నుంచి బటర్‌ఫ్లై గంధిమతి, ద్వరికేష్ షుగర్స్, ఎమ్కే గ్లోబల్, జీఎన్‌ఎఫ్‌సి, మణప్పురం ఫైనాన్స్, నందన్ డెనిమ్, ఆర్‌ఎస్‌డబ్ల్యుఎం, రుచిరా పేపర్స్, శ్రీకాళహస్తి పైప్స్‌లో తనకు ఉన్న వాటాలను కుదించుకున్నారు.

పొరింజు వెలియాత్ పోర్ట్‌ఫోలియో
స్మాల్ క్యాప్ స్టాక్స్‌ను పట్టుకోవడంతో పొరింజుకు ఒకప్పుడు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన ఎంపిక చేసిన చాలా స్టాక్స్ పరుగులు తీశాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆయన తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న చాలా చిన్న స్టాక్స్‌ను వదిలించుకున్నారు. వాటిల్లో ఏబిసి ఇండియా, బిసిఎల్ ఇండస్ట్రీస్, డ్యూరోప్లై, ఇజ్మో, జెఐటిఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్, పర్నాక్స్ ల్యాబ్స్ ఉన్నాయి.
వీటికి అదనంగా సిమ్కో, లిబర్టీ షూస్, పాల్రెడ్ టెక్నాలజీస్, విస్టా ఫార్మాలో తన వాటాలను సగానికిపైగా తగ్గించారు.

Read more about: stocks investers stock markets
English summary

పెద్ద ఇన్వెస్టర్లంతా ఈ స్టాక్స్ అమ్మేసుకుని బయటపడ్డారు.. మీ దగ్గర ఇంకా ఉన్నాయా.. | These Stocks Are Sold Out By Big Investors For Safe Side

Ace Investors like rakesh jhunjhunwala, Porinju veliyath and dolly khanna reduced their stakes in many mid, small and micro cap stocks. They have offloaded many stocks in 2018. Do you still hold them ? check their new reshuffled portfolios
Story first published: Thursday, February 7, 2019, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X