For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాదీ పూచీకత్తు ! అప్పులోళ్లకు జీ ఓనర్ సుభాష్ చంద్ర హామీ

భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర సాధ్యమైనంత వరకూ ఈ కష్టం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడ్తున్నారు.

By bharath
|

భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర సాధ్యమైనంత వరకూ ఈ కష్టం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడ్తున్నారు. ఇప్పటికే రుణగ్రహీతలతో ఓ అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్న ఆయన మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కూడా ఓ భరోసా ఇవ్వాల్సి వచ్చింది. కమిటీ ఆఫ్ లెండర్స్ అంతా కలిసి ఆయనపై ఒత్తిడి తెచ్చి వ్యక్తిగత పూచీకత్తును తీసుకున్నారు. దీంతో చేసేది ఆయన కూడా ఈ కష్టకాలంలో సరే అన్నారు.

నాదీ పూచీకత్తు ! అప్పులోళ్లకు జీ ఓనర్ సుభాష్ చంద్ర హామీ

ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సుభాష్ చంద్ర.. కమిటీ ఆఫ్ లెండర్స్‌లో ఓ ఫార్మల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దాని ప్రకారం వాళ్లు బయటి మార్కెట్లో స్టాక్ రేట్ పడిపోయినా తమ దగ్గర తాకట్టులో ఉన్న షేర్లను అమ్ముకోకూడదు. అలా అమ్మితే ఇద్దరూ నష్టపోతామని, 90 రోజులు ఓపిక పట్టాలని ఆయన కోరారు. సంస్థలు కూడా చేసేది లేక ఆగుతామని చెప్పారు. ఇప్పుడు జీ గ్రూప్ పై రూ.13000 కోట్ల రుణభారం ఉంది. ఈ అప్పులు తీర్చేందుకు ఆయన అధికంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్, డిష్ టీవీ షేర్లను తాకట్టు పెట్టారు.

ఎలాంటి హామీనిచ్చారు:
రుణదాతలతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం సంస్థలో వాటాల అమ్మకం పూర్తైన వెంటనే మొదటి ప్రయార్టీ ఇచ్చి అప్పులు తీర్చేయాలి, అధిక కవర్ కల్పించాలి, సంస్థలతో సంబంధం లేకుండా వ్యక్తిగత హామీనివ్వాలి అని ఒప్పందాన్ని రాసుకున్నారు.
ఇదే విషయాన్ని అటు సెబీ ఇటు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ (యాంఫీ) కూడా వివరించారు. ఎందుకంటే ఈ సిచ్యుయేషన్‌లో ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడాలంటే ఇదే ఏకైక మార్గమని తమకు అనిపించిందని, అందుకే ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్రతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మ్యూచువల్ ఫండ్ సంస్థలు వివరణ ఇచ్చాయి.

మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో భయం:
ఇప్పుడు జీ గ్రూప్ సంస్థ స్టాక్స్‌ను తాకట్టు కింద పెట్టుకున్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఆదిత్యబిర్లా క్యాపిటల్, హెచ్ డి ఎఫ్ సి మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ సంస్థలు ఉన్నాయి. ఇలా వివిధ సంస్థల దగ్గర సుమారు రూ.11645 కోట్ల షేర్లు తాకట్టులో ఉన్నాయి. ఒక్కసారిగా ఈ సంస్థలు ఏవైనా స్టాక్స్ అమ్మడం మొదలుపెడితే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోతుంది. అప్పుడు వేల్యుయేషన్ కూడా తగ్గిపోతుంది. అందుకే అప్పులు ఇచ్చిన కాళ్లావేళ్లా పడి ప్రస్తుతానికి స్టాక్స్ అమ్మకుండా ఆపుతున్నారు.

English summary

నాదీ పూచీకత్తు ! అప్పులోళ్లకు జీ ఓనర్ సుభాష్ చంద్ర హామీ | Essel Group Promoter Subhash Chandra Has Given Personal Guarantee To Lenders

Essel group promoter subhash chandra has given personal guarantee to lenders incase of any default. He asked lenders to wait patiently in this crisis. Mutual funds has taken personal gurantee of Mr. Subash to protect interest of their investors.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X