For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రస్తుతం రూ.6000 వేల కోట్లకు అధిపతి.ఈ సంపాదన ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవడం కాయం?

By Sabari
|

మన దగ్గర ట్యాలెంట్ ఉంటే, ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఆపలేదని చెబుతారు. ఈ స్టోరీ కూడా అలాంటిదే. సిమ్ కార్డులు అమ్మే ఓ కుర్రాడు.రూ.6000 కోట్లకు అధిపతి అయ్యాడంటే నమ్ముతారా? కచ్చితంగా నమ్మాలి. ఎందుకుంటే ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. ఆ కుర్రాడు ఎవరు? అతని కథేంటో మీరూ తెలుసుకోండి.

రోడ్డు పక్కన

రోడ్డు పక్కన

మనం రోడ్డు పక్కన వెళ్తుంటే అక్కడ ఓ హోటల్ కనిపిస్తుంది. దాని మీద OYO అని రాసి ఉంటుంది. ఇలా చాలా ఊళ్లలో, చాలా చోట్ల వేలాది హోటళ్ల మీద ఇలా OYO అని రాసి ఉంటుంది

 రితేష్ అగర్వాల్

రితేష్ అగర్వాల్

ఏదైనా ఊరికి వెళ్లి అక్కడ ఎక్కడ దిగాలో తెలియక ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఓయో రూమ్స్ వెబ్‌సైట్, యాప్‌లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఈ OYO రూమ్స్ అందుబాటులో

ఉన్నాయి. ఈ OYO రూమ్స్ ఫౌండరే మన కథలో హీరో రితేష్ అగర్వాల్.

17 ఏళ్ల వయసులో

17 ఏళ్ల వయసులో

రితేష్ అగర్వాల్ 17 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్ మానేసి OYO రూమ్స్ సంస్థను ప్రారంభించాడు. ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా దాన్ని ఆరేళ్లలో రూ.6000 కోట్లకు చేర్చాడు.

సాఫ్ట్ బ్యాంక్

సాఫ్ట్ బ్యాంక్

అతని సక్సెస్ ఎలాంటిదంటే, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పేరుగాంచిన సాఫ్ట్ బ్యాంక్ OYO రూమ్స్‌ సంస్థలో పెట్టుబడులు పెడతామని సంకేతాలిచ్చింది. బ్యాంక్ సీఈవో మసాయోషీ సన్. రితేష్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.

ఒడిశాలోని

ఒడిశాలోని

ఒడిశాలోని కటక్‌లో పుట్టిన రితేష్ అగర్వాల్.రాయగఢ్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఐఐటీలో ఇంజినీరింగ్ చేద్దామనుకుని ఎంట్రన్స్‌ కోసం కోచింగ్ తీసుకున్నాడు. కానీ సఫలం కాలేదు.

లండన్‌లో

లండన్‌లో

ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఢిల్లీలో ఉన్న వర్సిటీ క్యాంపస్‌కి కేవలం రెండే రోజులు వెళ్లినట్టు రితేష్ చెప్పాడు

తొలుత సిమ్ కార్డులు

తొలుత సిమ్ కార్డులు

చదువు మానేస్తాననడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. తర్వాత ఎలాగో ఒప్పుకున్నారు. కానీ, అతనికి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. తొలుత సిమ్ కార్డులు కూడా అమ్మాడు.

 ఐడియా ఇలా

ఐడియా ఇలా

రితేష్‌కి ఊర్లు తిరగడం అంటే సరదా. 2009లో ఓసారి డెహ్రాడూన్, మసూరీ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ ఉన్న సుందరదృశ్యాలు చూసి.వీటి గురించి బయట జనాలకి పెద్దగా తెలియదనుకున్నాడు.

 ఆన్‌లైన్ పోర్టల్

ఆన్‌లైన్ పోర్టల్

అదే సమయంలో ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించి దాంట్లో అందర్నీ భాగస్వామ్యం చేయాలనుకున్నాడు. అలాగే,పర్యాటకులకు సేవలు అందించేందుకు హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల యజమానులతో కలసి ఓ పోర్టల్ ప్రారంభించాలనుకున్నాడు.

 ఐడియా నచ్చి

ఐడియా నచ్చి

2011లో రితేష్ అగర్వాల్ ఓరావెల్ అనే కంపెనీని ప్రారంభించాడు. అతడి ఐడియా నచ్చి గుర్‌గావ్‌కి చెందిన మనీష్ సింగ్ అందులో పెట్టుబడి పెట్టి కో ఫౌండర్‌గా మారాడు. 2012లో ఓరావెల్‌కి మంచి లాభాలు వచ్చాయి.

ఎన్నో సమస్యలు

ఎన్నో సమస్యలు

కంపెనీని వృద్ధిలోకి తీసుకురావడానికి రితేష్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రాపర్టీ యజమానులు, కస్టమర్ల చెంతకు సంస్థను తీసుకెళ్లే క్రమంలో పెట్టుబడి, మార్కెటింగ్ లాంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.

 పెట్టుబడుల ప్రవాహం

పెట్టుబడుల ప్రవాహం

ఒకసారి సక్సెస్ పట్టాలు ఎక్కడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. OYOలో ఇన్వెస్ట్ చేయడానికి సాఫ్ట్ బ్యాంక్ ముందుకొచ్చింది.

హీరో ఎంటర్‌ప్రైజ్

హీరో ఎంటర్‌ప్రైజ్

హీరో ఎంటర్‌ప్రైజ్ రూ.1600 కోట్ల ఫండింగ్ చేయడానికి ముందుకొచ్చింది. ఆ నిధులను భారత్, దక్షిణాసియాల్లో కంపెనీ విస్తరణ కోసం వినియోగించనున్నారు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్లతో కలుపుకొని కంపెనీ విలువ ప్రస్తుతం రూ.6000 కోట్ల వరకు చేరింది.

Read more about: success story
English summary

ప్రస్తుతం రూ.6000 వేల కోట్లకు అధిపతి.ఈ సంపాదన ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవడం కాయం? | Success Story of OYO rooms Founder Ritish agarwal

If we have a talent, we say that no force in the world has stopped us. This story is something like that. A boy who sells SIM cards. Do you believe that he was the head of 6000 crore? Certainly believe. This is not a reel story. Real Story. Who is that boy? Learn from his story.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X