కొత్త కార్లు కొనొద్దు, విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించండి, ప్రభుత్వ ఆఫీసులు, అధికారిక నివాసలకయ్యే ఖర్చులు తగ్గించండంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి పదే పదే కోరుతున్నారు.

రైతు రుణ మాఫీ
రూ.50 కోట్ల విలువైన రైతు రుణ మాఫీకి ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం అధికారిక నివాసానికి మారలేదు. జేపీ నగర్లోని సొంత ఇంట్లో నుంచే వ్యవహారాలు చక్కబెడుతున్నారు.

పొదుపు చర్యల్లో
పొదుపు చర్యల్లో భాగంగా కుమారస్వామి తన వ్యక్తిగత ఎస్‌యూవీనే వాడుతున్నారు. ఆయన వాడే టాప్ ఎండ్ రేంజ్ రోవర్ ధర కోటిన్నర రూపాయల పైమాటే. ఇంతకు ముందు సిద్ధ రామయ్య టయోటా ఫార్చ్యునర్ వాడారు.

హార్ట్ సర్జరీ
కుమారస్వామికి ఇప్పటికే రెండుసార్లు హార్ట్ సర్జరీ జరిగింది. దీంతో శారీరకంగా ఒత్తిడిని తగ్గించుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కస్తూరి మీడియా ప్రయివేట్ లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయిన కుమారస్వామి రేంజ్ రోవర్లో ప్రత్యేకమైన షాక్ అబ్జర్వర్లను అమర్చారు. సీట్లు కూడా మరింత సౌకర్యంగా ఉంటాయి.

కార్యకర్తలు
పొదుపు చేద్దామంటూ కుమారస్వామి పిలుపునివ్వడం పట్ల సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.

కొత్త కార్లు
మీరు వాడే కారు తాగే డీజిల్ ఎంత? సీఎం తన సొంత వాహనం వాడుకోవడం అంత గొప్ప విషయమా? అని నిలదీస్తున్నారు. కొత్త కార్లు కొనొద్దన్న కుమారస్వామి నిర్ణయం పట్ల మంత్రులు కూడా అసంతృప్తి ఉన్నప్పటికీ బయట పడటం లేదు.

మంచి కండీషన్లోనే
అధికారులు మాత్రం సీఎం చేపడుతున్న పొదుపు చర్యల్లో సొంత కారు వాడటం ఒకటని, ఇంకా ఆయన చాలా చేస్తున్నారని సెలవిస్తున్నారు. ప్రస్తుతం మా దగ్గర 36 వాహనాలున్నాయి. ఏవీ 50 వేల కి.మీ. మించి ప్రయాణించలేదు. అవన్నీ మంచి కండీషన్లోనే ఉన్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొత్త వాహనాలు కొనే ప్రతిపాదనేదీ లేదని ఆయన చెప్పారు.

రేంజ్ రోవర్
కొసమెరుపు ఏంటంటే. ప్రస్తుతం వాడుతున్న రేంజ్ రోవర్ కారు కుమారస్వామి కుటుంబానికి కలిసొచ్చిందట. అందుకే దాన్నే వాడాలని ఇంట్లో వాళ్లు సూచించారని సమాచారం.

సీఎం సొంతింటి
ఇక సీఎం సొంతింటి నుంచే పనులు చక్కబెట్టడానికి, అధికారిక నివాసానికి వెళ్లడానికి కూడా ‘పొదుపు చర్యలు' కాకుండా వేరే కారణం ఉంది.

వాస్తు లోపం
అదేంటంటే. సీఎం అధికారిక నివాసానికి వాస్తు లోపం ఉందట. ఆయన సొంతింటికి వాస్తు బాగుంది, లక్కీ అనే నమ్మకం ఉంది.

గుసగుసలు
ఆ ఇంట్లోకి వెళ్లాకే ఆయనకు అన్ని రకాలుగా కలిసొచ్చిందట. కుమారస్వామి పొదుపు చర్యల వెనుక కారణాలు ఇవేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications