For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పుడు మన దేశంలో బంగారం కొనొచ్చా...... మీరే చూడండి

By Sabari
|

ఎన్ని రకాల పెట్టుబడి అవకాశాలున్నా భారతీయులకు బంగారం కొనుగోళ్లపై ఉన్న మోజు మరిదేనిపైనా ఉండదు. అందుకే స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో కచ్చితంగా బంగారాన్ని చేర్చుకుంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో పసిడిని కొనుగోలు చేయవచ్చో లేదో చూద్దాం..


ఇటీవల దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరల జోరుకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర 32,050 రూపాయల నుంచి 32,150 రూపాయల స్థాయిలో ఉంది. శనివారం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర కొద్దిగా పుంజుకుని 40,400 రూపాయల నుంచి 40,500 రూపాయల వరకు పలికింది. బంగారం ధర 32,050 నుంచి 32,150 రూపాయలు పలికింది.

ఇప్పుడు మన దేశంలో బంగారం కొనొచ్చా...... మీరే చూడండి

ఇదీ కారణం

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగడం, రూపాయితో సహా ఇతర కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు పెరగడం, దేశీయ మార్కెట్లో డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండడం ధరల జోరు తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. స్టాక్‌ మార్కెట్లు జోష్‌గా ముందుకు సాగిన తరుణంలో బంగారంలోని పెట్టుబడులు తరలిపోతున్నాయి. డాలర్‌ బలోపేతం కావడం కూడా పసిడి పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.


మార్కెట్‌ ఔట్‌లుక్‌

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 1,316 డాలర్ల స్థాయిలో ఉంది. జూన్‌లో డెలివరీ ఉండే ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఔన్స్‌ ధర 1,309 డాలర్ల వద్ద కోట్‌ అవుతోంది. సానుకూల సంకేతాలతో మున్ముందు ఇది 1,300 డాలర్లకు కూడా దిగిరావచ్చని భావిస్తున్నారు. 'డాలర్‌ మారకం రేటు మరింత పుంజుకుంటే ఔన్స్‌ బంగారం ధర 1,300 డాలర్లకు తగ్గే అవకాశాన్ని కొట్టివేయలేం' అని కామర్జ్‌బ్యాంక్‌కు చెందిన అంతర్జాతీయ కమోడిటీస్‌ విశ్లేషకుడు డేనియల్‌ బ్రిస్‌మాన్‌ చెప్పడం విశేషం. పసిడి ధర గతంలో 1,300 డాలర్ల కంటే దిగువకు వచ్చినపుడల్లా కొనుగోళ్లు పెద్ద ఎత్తున పెరిగేవి. ఈసారి కూడా అదే జరుగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దేశీయ మార్కెట్‌ పరిస్థితి
దేశీయంగా ప్రస్తుతానికి బులియన్‌ మార్కెట్‌ వేగంగా దూసుకుపోయే సూచనలు కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వేడెక్కిన స్టాక్‌ మార్కెట్‌ మాత్రం తరచూ ఆటుపోట్లకు లోనవుతోంది. దీంతో పెట్టుబడి లాభాల కోసం చూసే ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌లోని తమ పెట్టుబడుల్లో 10-15 శాతం బులియన్‌ మార్కెట్‌వైపు మళ్లించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
'బంగారంలో మదుపు చేసేందుకు ఇది సరైన సమయం. ఈక్విటీ మార్కెట్లో సంక్షోభం ఏర్పడినపుడు, అంతర్జాతీయ సంక్షోభాలు, దేశంలో రాజకీయ అనిశ్చితి, సంక్షోభం ఏర్పడినపుడల్లా పసిడి ధర పెరుగుతుంది. అయితే ఇపుడున్న మార్కెట్‌ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు వెండి కంటే పసిడిలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది' అని అబాన్స్‌ కమోడిటీస్‌ అనే కమొడిటీస్‌ బ్రోకింగ్‌ సంస్థ సిఎండి అభిషేక్‌ భన్సాల్‌ చెప్పారు.
మొత్తంగా ఈ సంవత్సరం భారత మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర 31,000 రూపాయల నుంచి 33,500 రూపాయల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరీ అమ్మకాల ఒత్తిడి ఎదురైనా రూ.30,000 దిగువకైతే తగ్గకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ధరల్లో కదలికలను పరిశీలిస్తూ పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కంటెంట్ ఫ్రొం ఏబిన్.

Read more about: gold gold rates
English summary

ఇప్పుడు మన దేశంలో బంగారం కొనొచ్చా...... మీరే చూడండి | Now you can buy gold in our country ...... Check it Your Self

No matter what type of investment opportunities the Indians are not on the other side of gold purchases. That's why stock market investors will definitely add gold to their portfolio.
Story first published: Monday, May 7, 2018, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X