For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌ళ్లీ స‌రికొత్త రికార్డుల‌ను న‌మోదు చేసిన సూచీలు

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 251 పాయింట్ల లాభంతో 34,843 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60.30పాయింట్ల లాభంతో 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 34,687.21- 34,963.69 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

|

సంక్రాంతి పండగ ప‌ర్వాన స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డు గ‌రిష్టాల వ‌ద్ద ముగిశాయి. ప్రధానంగా ఆర్థిక సేవ‌లు, మీడియా, నిఫ్టీ బ్యాంక్‌, ప్రవేట్‌ బ్యాంక్‌ షేర్ల‌లో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులతో నేటి ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు లాభాల ర్యాలీ చేశాయి. ఈ నేపథ్యంలోనే సూచీలు సోమవారం మరోసారి నూత‌న‌ జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 251 పాయింట్ల లాభంతో 34,843 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60.30పాయింట్ల లాభంతో 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 34,687.21- 34,963.69 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ సూచీ 10,713.80-10,782.65 శ్రేణిలో కదలాడింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ పాయింట్ల 26,091.80 వ‌ద్ద కొత్త రికార్డును నెల‌కొల్పి 20,069 పాయింట్ల వద్ద ముగిసింది.

స్టాక్ మార్కెట్

నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌డీఎఫ్‌సీ దాదాపు 6 శాతం దూసుకెళ్లగా, ఐసీఐసీఐ, అంబుజా, జీ, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐషర్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరోమోటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, యస్‌బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం 2.5-1.2 శాతం తిరోగమించాయి. బీఎస్‌ఈలో 1,525 షేర్లు లాభపడితే 1412 డీలాపడ్డాయ్‌.

English summary

మ‌ళ్లీ స‌రికొత్త రికార్డుల‌ను న‌మోదు చేసిన సూచీలు | Sensex ends at new high of 34,843 a new record

The Sensex and Nifty hit record closing highs for a third straight session on Monday on positive macro data which were announced after trading hours on Friday and encouraging earnings posted by some bluechip companies coupled with a firm global trend.
Story first published: Monday, January 15, 2018, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X