వరుసగా మూడో రోజు కన్సాలిడేషన్ బాటలోనే సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,793 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 1 పాయింట్ బలపడి 10,443
వరుసగా మూడో రోజు కన్సాలిడేషన్ బాటలోనే సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,793 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 1 పాయింట్ బలపడి 10,443 వద్ద స్థిరపడింది. అయితే రోజు మొత్తం మార్కెట్లు సానుకూలంగానే కదలడం గమనించదగ్గ అంశం. మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడగా.. నాస్‌డాక్ తొలిసారి 7,000 పాయింట్ల ఎగువన స్థిరపడింది.

బీఎస్ఈ సూచీలో వాహన రంగం తప్ప అన్నీ సానుకూలంగా సాగాయి. అందులో లోహ రంగం(1.47%), క్యాపిటల్ గూడ్స్(1.22%), స్థిరాస్తి(1.21%), కన్సూమర్ డ్యూరబుల్స్(0.98%), ఆటో(0.26%) లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో అదానీ పోర్ట్స్ (2.78 శాతం), ఎల్ అండ్ టీ (2.17 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్ (+ 1.88 శాతం), యస్ బ్యాంక్ (+ 1.33 శాతం), కోల్ ఇండియా (+ 0.72) లాభపడ్డాయి. మరో వైపు రెడ్డీస్ (-2.97%), విప్రో (-2.73%), ఒఎన్జిసి (-1.65%), బజాజ్ ఆటో (-1.61%), మారుతీ (-1.35%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications