For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ‌రుస‌గా మూడో రోజు లాభాలు

అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల ప‌రుగు తీశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు జత కలవడంతో రోజు మొత్తం మార్కెట్లు పటిష్ట లాభాలతో కదిలాయి. ట్రేడ

|

అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల ప‌రుగు తీశాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు జత కలవడంతో రోజు మొత్తం మార్కెట్లు పటిష్ట లాభాలతో కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 205 పాయింట్లు పెరిగి 33,456 వద్ద ముగియ‌గా నిఫ్టీ సైతం 57 పాయింట్లు పుంజుకుని 10,322 వద్ద స్థిరపడింది.

 లాభాల్లో మార్కెట్లు

రియల్టీ మినహా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. రియల్టీ నామమాత్ర నష్టంతో ముగిసింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో అరబిందో, టీసీఎస్‌, యూపీఎల్‌, ఎంఅండ్ఎం, లుపిన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, ఎస్‌బీఐ 3-1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఐబీహౌసింగ్, ఆర్‌ఐఎల్‌ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
బీఎస్ఈలో లాభ‌ప‌డిన వాటిలో టీసీఎస్(2.35%), ఎం అండ్ ఎం(2.16%), లుపిన్(2.15%), హెచ్‌డీఎఫ్‌సీ(2.14%), విప్రో(2.12%), కోల్ ఇండియా(1.93%) ముందుండ‌గా మ‌రో వైపు న‌ష్ట‌పోయిన వాటిలో ఎన్టీపీసీ(1.36%), ఓఎన్జీసీ(0.78%), రిల‌య‌న్స్(0.55%), హెచ్‌యూఎల్(0.48%), అదానీ పోర్ట్స్‌(0.42%), ఏసియ‌న్ పెయింట్స్(0.38%) ఉన్నాయి.

English summary

వ‌రుస‌గా మూడో రోజు లాభాలు | sensex gained over 200 points

Sensex surges 205 points as investors bet on BJP's win in Gujarat elections
Story first published: Monday, December 11, 2017, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X