For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ఎస్ఈలో 2.3% లాభ‌ప‌డ్డ యాక్సిస్ బ్యాంకు

ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధన్యం ఇవ్వడంతో మొద‌ట సూచీలు నష్టాలతో ట్రేడయ్యాయి. అయితే చివరి అర్ధగంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో నష్టాల నుంచి బయటపడి సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.

|

నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియ‌నుండ‌టంతో మదుప‌ర్లు ఆచితూచి స్పందించారు. దీంతో మార్కెట్లు రోజంతా నీరసంగా కదిలాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధన్యం ఇవ్వడంతో నష్టాలతో ట్రేడయ్యాయి. అయితే చివరి అర్ధగంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో నష్టాల నుంచి బయటపడి సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 45 పాయింట్లు ఎగ‌సి 33,724 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 10,399 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 10,400 సమీపంలో ముగిసింది.

 స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి(1.24%), ప‌వ‌ర్(1.22%), మౌలిక రంగం(0.91%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్(0.53%) లాభ‌ప‌డ‌గా; మ‌రో వైపు లోహ‌(0.65%), ఐటీ(0.23%), ఎఫ్ఎంసీజీ(0.19%), చ‌మురు,స‌హజ వాయు(0.13%) రంగాలు న‌ష్టాల పాల‌య్యాయి.
సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డ్డ‌,న‌ష్ట‌పోయిన కంపెనీల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డ వాటిలోఎన్టీపీసీ (+ 3.13%), యాక్సిస్ బ్యాంక్ (+ 2.73%), ఒఎన్జిసి (+ 1.41%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (+ 0.9%), విప్రో (+ 0.77%) ఉండ‌గా, అత్యధికంగా నష్టపోయిన వాటిలోఇన్ఫోసిస్ (-1.23%), టాటా మోటార్స్ (-0.89%), అదానీ పోర్ట్స్ (-0.88%), టాటా స్టీల్ (-0.83%), బజాజ్ ఆటో (-0.67%) ముందున్నాయి.

English summary

ఎన్ఎస్ఈలో 2.3% లాభ‌ప‌డ్డ యాక్సిస్ బ్యాంకు | Sensex ends marginally higher

The 30-share BSE index Sensex ended higher by 45.2 points or 0.13 per cent at 33,724.44 after earling falling as much as 0.4 per cent. Similarly, the 50-share NSE index Nifty closed up 9.85 points or 0.09 per cent at 10,399.55 after earlier falling as much as 0.5 per cent.
Story first published: Monday, November 27, 2017, 17:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X