For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.93 పెరిగింది!

వంట వండుకోవ‌డానికి ఉప‌యోగించే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను సైతం నెమ్మ‌దిగా తెలియ‌కుండానే పెంచుతున్నారు. బుధ‌వార ఒక్క రోజు వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.4.50 మేర ప్ర‌భుత్వం పెంచేసింది. జులై 2016 నుంచి నెల

|

వంట వండుకోవ‌డానికి ఉప‌యోగించే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను సైతం నెమ్మ‌దిగా తెలియ‌కుండానే పెంచుతున్నారు. బుధ‌వార ఒక్క రోజు వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.4.50 మేర ప్ర‌భుత్వం పెంచేసింది. జులై 2016 నుంచి నెల‌వారీ సిలిండ‌ర్ ధ‌ర‌ల మార్పును చూస్తే ఇలా ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర పెర‌గ‌డం 19వ సారి.
అదే విధంగా జెట్ ఇంధ‌నం లేదా ఎయిర్ ట‌ర్బైన్ ఫ్యూయ‌ల్ ధ‌ర సైతం 2% పెరిగింది. ఆగ‌స్టు నెల త‌ర్వాత వీటి ధ‌ర‌ల‌ను నాలుగోసారి బుధ‌వారం రోజున పెంచారు. ప్ర‌భుత్వ రంగ చ‌మురు కంపెనీలు ప్ర‌క‌టించిన వెబ్‌సైట్ స‌మాచారం ఆధారంగా ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను అంచ‌నా వేస్తున్నారు.
అదే విధంగా నాన్ స‌బ్సిడీ ఎల్‌పీజీ(గ్యాస్ సిలిండ‌ర్) ధ‌ర‌ను మార్కెట్ ధ‌ర‌ల ఆధారంగా రూ.93 పెంచ‌గా ప్ర‌స్తుతం దాని ధ‌ర రూ.742గా ప‌లుకుతోంది. గ‌త రివిజ‌న్లో అక్టోబ‌ర్ 1 రోజున ఈ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.50 పెంచ‌గా రూ.649 వ‌ద్ద ఉండింది. 14.2 కేజీల సిలిండ‌ర్ ధ‌ర‌ను ఇప్పుడు పెంచిన రూ.4.50తో క‌లుపుకుంటే మార్కెట్ రేటు రూ.495.69గా పలుకుతోంది. వ‌చ్చే ఏడాది మార్చిలోపు పూర్తిగా స‌బ్సిడీల‌ను ఎత్తివేసే నెపంతో ప్ర‌భుత్వ రంగ చమురు కంపెనీల‌ను ప్ర‌తి నెలా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను మార్చాల‌స్సిందిగా ప్ర‌భుత్వం గ‌త ఏడాదే కోరింది. దాంతో చ‌మురు కంపెనీలు త‌మ మీద‌, ప్ర‌భుత్వంపైన ఉన్న స‌బ్సిడీ భారాన్ని తొల‌గించుకునేందుకు నెలా నెలా రేట్ల‌ను మారుస్తున్నాయి.

 గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మ‌ళ్లీ పెరిగింది

ఈ విధంగా చ‌మురు కంపెనీలు చేయ‌డం మొద‌లుపెట్టినప్ప‌టి నుంచి ఎల్‌పీజీ రేట్లు ఒక్కో సిలిండ‌ర్‌కు రూ.76.51 మేర పెర‌గ్గా, 14.2 కేజీల సిలిండ‌ర్ ధ‌ర జూన్,2016లో రూ.419.18 వ‌ద్ద ఉన్న‌ది. ప్ర‌తి కుటుంబం ఏడాదికి 12 సిలిండ‌ర్ల వ‌ర‌కూ స‌బ్సిడీకి అర్హ‌త సాధిస్తారు. అయితే దీని వ‌ల్ల ప్ర‌భుత్వంపై విప‌రీత‌మైన భారం ప‌డుతోంది. ఏదైతే ప్ర‌జ‌ల‌కు స‌బ్సిడీ ధర‌కు అందిస్తున్నారో ఈ మేర‌కు అవ‌స‌ర‌మైన వేల కోట్ల డ‌బ్బును ప్ర‌భుత్వం ఆయిల్ కంపెనీల‌కు చెల్లిస్తుంది.

Read more about: gas lpg
English summary

వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.93 పెరిగింది! | price of Non-subsidized gas cylinder rate hiked by 93

price of non subsidized lpg hiked by 93 rupees in a row
Story first published: Thursday, November 2, 2017, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X