సుమారు రూ. 50,000 దాకా సొమ్మును డిజిటల్ వాలెట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు, లిక్విడ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆన్‌లైన్ మాధ్యమ
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులకు వాలెట్లను వాడేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అదే విధంగా యువతరానికి పెట్టుబడి సాధనాలను మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు రూ. 50,000 దాకా సొమ్మును డిజిటల్ వాలెట్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు వెసులుబాటు కల్పించింది.

మరోవైపు, లిక్విడ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఆన్‌లైన్ మాధ్యమంలో తక్షణ ఉపసంహరణ వెసులుబాటు కల్పించాలంటూ మ్యూచువల్ ఫండ్ సంస్థలను సెబీ ఆదేశించింది. విత్‌డ్రాయల్ పరిమితి రూ. 50,000 లేదా ఫోలియో విలువలో 90 శాతంగా (ఏది తక్కువైతే అది) ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేందుకు, కుటుంబాల పొదుపు మొత్తాలను క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ వాలెట్స్ ద్వారా మదుపర్లు.. ఫండ్ స్కీములో రూ.50,000 దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని, అంతకు మించకుండా చూడాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు సెబీ సూచించింది. పెట్టుబడుల ఉపసంహరించుకున్న పక్షంలో వచ్చే మొత్తాన్ని యూనిట్ హోల్డరు బ్యాంకు ఖాతాకు మాత్రమే బదిలీ చేయాలని పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ తెలిపింది. ఇలా తమ ద్వారా ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ-వాలెట్ సంస్థలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ క్యాష్ బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి లేదని స్పష్టం చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications