For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంత‌ర్జాతీయ మార్కెట్లో ప్ర‌వేశం ఉన్న ఏడు మ్యూచువ‌ల్ ఫండ్లు

|

మార్కెట్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే ఆసక్తి ఉండి నేరుగా స్టాక్‌ల్లో పెట్టుబ‌డులు పెట్ట‌లేనివారికి మ్యూచువ‌ల్ ఫండ్లు ఒక చ‌క్క‌టి మార్గం. ఇక్క‌డ మ్యూచువ‌ల్ ఫండ్లు వివిధ రంగాలలో, వివిధ దేశాల‌లో పెట్టుబ‌డులు పెడుతూ ఉంటాయి. అందుకే వీటిలో వైవిధ్యం ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టిన అలాంటి 7 మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌ను ఇక్కడ చూద్దాం.

trying to invest international markets

మోతీలాల్ ఒస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్‌డాక్‌-100 ఈటీఎఫ్ ఫండ్‌

ఈ ఫండ్ గ‌త మూడేళ్ల‌లో 18 శాతం రాబ‌డుల‌ను ఇచ్చింది. ఈ ఫండ్ మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్ మొదైలైన సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టింది. ఈ ఫండ్ యూనిట్‌ నిక‌ర ఆస్తుల విలువ‌(ఎన్ఏవీ) రూ. 296.95గా ఉంది.

బిర్లా స‌న్ లైఫ్ గ్లోబ‌ల్ రియ‌ల్ ఎస్టేట్ ఫండ్‌-డైరెక్ట్

గ‌త ఏడాది కాలంలో ఈ ఫండ్ 15 శాతం రాబ‌డినిచ్చింది. ఈ ఫండ్‌లో త‌క్కువ కార్ప‌స్ ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 1.46 శాతంగా ఉంది. ఫండ్ యూనిట్ నిక‌ర ఆస్తుల విలువ‌(ఎన్ఏవీ) రూ. 19.53గా ఉంది. ఇది ఓపెన్ ఎండెడ్ ప‌థ‌కం.
ఫ్రాంక్లిన్ ఏసియ‌న్ ఈక్విటీ ఫండ్‌
గత మూడేళ్ల‌లో ఈ ఫండ్ 6.80 శాతం రాబడినిచ్చింది. నాణ్య‌మైన కంపెనీలైన శామ్‌సంగ్ ఎల‌క్ట్రానిక్‌, అలిబాబా హోల్డింగ్స్‌, బైదూ, తైవాన్ సెమీకండ‌క్ట‌ర్స్ వంటి వాటిల్లో ఈ ఫండ్ పెట్టుబ‌డులు పెట్టింది. మ‌రీ ఉత్త‌మ‌మైనద‌ని కాక‌పోయినా మంచి ఫండ్‌గానే చెప్పుకోవ‌చ్చు.
ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడ‌ర్ ఫ్రాంక్లిన్ యూఎస్ ఆప‌ర్చునిటీస్ ఫండ్
గ‌త మూడేళ్ల‌లో ఈ ఫండ్ 11.28 రాబ‌డుల‌ను తీసుకొచ్చింది. గ్రోత్ ప్లాన్‌లో ఈ ఫండ్ యూనిట్ నిక‌ర ఆస్తుల విలువ(ఎన్ఏవీ) 17.16గా ఉంది. అంత‌ర్జాతీయ షేర్ల‌ల్లో ఈ ఫండ్‌కు మంచి వాటా ఉంది.
డీఎస్‌పీ బ్లాక్‌రాక్ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్
మూడేళ్ల కాలంలో ఈ ఫండ్ దాదాపు 11 శాతం రాబ‌డినిచ్చింది. గ్రోత్ ప్లాన్‌లో ఈ ఫండ్ యూనిట్ నిక‌ర ఆస్తుల విలువ‌(ఎన్ఏవీ) రూ. 17.16గా ఉంది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఈ ఫండ్‌కు మంచి ప్ర‌వేశం ఉంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ గ్లోబ‌ల్ స్టేబుల్ ఈక్విటీ ఫండ్
ఏడాది కాలంలో 13 శాతం రాబ‌డితో ఈ ఫండ్ మంచిగానే ప‌నిచేస్తోంది. భార‌త‌దేశం కేంద్రంగా ప‌నిచేస్తున్న కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టిన కొన్ని ఫండ్ల కంటే ఈ ఫండ్ మంచి రాబడుల‌ను సాధిస్తోంది.
రిల‌య‌న్స్ జ‌పాన్ ఈక్విటీ ఫండ్- డైరెక్ట్ ప్లాన్‌
జపాన్ మార్కెట్లలో ఆస‌క్తి ఉండి అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే వారికి ఈ ఫండ్ ఉప‌యోగ‌కారిగా ఉంటుంది. జపాన్ మార్కెట్ల‌లో మంద‌గ‌మ‌నం కార‌ణంగా గ‌త ఏడాది కాలంలో ఈ ఫండ్ -10.10 శాతం చొప్పున రుణాత్మ‌క రాబ‌డినిచ్చింది. ఒక‌సారి జ‌ప‌నీస్ మార్కెట్లు కోలుకుంటే ఈ పండ్ బాగా ఉండ‌గ‌ల‌దు.

English summary

అంత‌ర్జాతీయ మార్కెట్లో ప్ర‌వేశం ఉన్న ఏడు మ్యూచువ‌ల్ ఫండ్లు | mutual funds that have international exposure

Mutual funds give diversification for your investments. If you are looking to invest across markets, the best way would be to invest through some of the mutual fund schemes that have invested in companies across the world.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X