For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

By Nageswara Rao
|

దేశీయ విమానయాన రంగంలో దూసుకుపోతున్న ఇండిగో సంస్ధ గడచిన ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1,304 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక లాభాలను నమోదు చేసింది.

గతేడాదితో పోలిస్తే కంపెనీ నికరలాభం (రూ. 317 కోట్లు)తో పోలిస్తే నాలుగింతల వృద్ధిని నమోదు చేసింది. వరుసగా ఏడు ఆర్ధిక సంవత్సరాల్లో ఇండిగో లాభాలను నమోదు చేసింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం సైతం 25 శాతం వృద్ధి రేటుతో రూ.11,447 కోట్ల నుంచి రూ.14,320 కోట్లకు చేరింది.

ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ విమానయాన రంగ ప్యాసింజర్ మార్కెట్‌లో 33.8 శాతం వాటా కలిగి ఉంది. దేశంలోని అనేక ఎయిర్‌లైన్స్‌ సంస్థలు నష్టాల్లో నడుస్తుంటే ఇండిగో మాత్రం లాభాలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇండిగో సంస్ధ 97 విమానాలతో ప్రతి రోజూ 648 విమాన సర్వీసులు నడుపుతోంది.

 ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

గడచిన ఆర్ధక సంవత్సరంలో ఇండిగో రాబడులు 25 శాతం వృద్ధితో రూ. 14,320 కోట్లకు పెరిగాయి. ఈ విమానయాన సంస్ధలో ఇంటర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజ్‌కు చెందిన రాహుల్ భాటియాకు 51 శాతం వాటా ఉంది. ఇది ఇలా ఉంటే కంపెనీ మరోవైపు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరించేందుకు సైతం సిద్ధమవుతోంది.

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

దీనికోసం గత నెల 15న 250 ఎయిర్‌బస్‌ ఎ320 నియో విమానాలు కొనేందుకు ఆర్డర్‌ పెట్టింది. ఇందుకోసం కంపెనీ 26,050 కోట్ల డాలర్లు (సుమారు రూ.2 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతోంది. ఇప్పటి వరకు దాదాపు 530 ఎ320 విమానాల కొనుగోలు కోసం ఆర్డర్‌ చేసింది. ఇందులో ఇప్పటికే వంద విమానాలు ఇండిగోకు చేరాయి.

 ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

దేశంలోని మిగతా ఎయిర్‌లైన్స్‌ సంస్థలన్నీ ఖర్చుల భారంతో తంటాలు పడుతుంటే, ఇండిగో మాత్రం ఖర్చులను ఎక్కడికక్కడ అదుపు చేస్తూ లాభాల బాట పట్టింది. దేశంలో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సగటున ఎనిమిది నుంచి 12 శాతం ఆదాయం నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నాయి.

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

డిసెంబర్‌, 2014తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ తన ఆదాయంలో దాదాపు 14.5 శాతం నిర్వహణ కోసం ఖర్చు చేసింది. ఇలా అదుపులేని నిర్వహణ ఖర్చుల వల్లే విజయ్ మాల్యా నిర్వహణలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మూతపడింది.
ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

అనవసర హంగులు, ఆర్భాటాలకు పోకుండా ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు పెట్టుకోవడమే ఇండిగో ఎయిర్ లైన్స్ దేశీయ విమానయాన మార్కెట్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డానికి కారణం. త్వరలోనే ఇండిగో సంస్ధ రూ.2,500 కోట్ల సమీకరణ కోసం పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోంది.

 ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు

ఇందుకోసం ఈ సంవత్సరం జూలైలోనే మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.

English summary

ఇండిగో: కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు | IndiGo profit jumps over 300% YoY to Rs 1304cr in FY15

The country's largest aviation firm IndiGo said its fiscal year 2015 profit surged 314 percent, from Rs 317 crore last year, to Rs 1,304 crore.
Story first published: Friday, September 11, 2015, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X