For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట(ఫోటోలు)

By Nageswara Rao
|

అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలతో మార్కెట్లు హోరెత్తాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ బంగారం, ఆభరణాల షాపులు కొనుగోలుదార్లతో కిటకిటలాడాయి. ఒక్కరోజే అమ్మకాలు 10-20 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా పరిశీస్తే, చెన్నై, హైదరాబాద్‌ మినహా ఇతర నగరాల్లో గతేడాది అక్షయ తృతీయతో పోలిస్తే బంగారం ధరలు తగ్గాయి.

చెన్నైలో రద్దీ ఎక్కువగా ఉండటంతో రాత్రి బాగా పొద్దు పోయేవరకు షాపులను తెరిచి ఉంచారు. అక్షయ తృతీయ రోజున దేశ వ్యాప్తంగా జరిగిన బంగారు అమ్మకాల్లో దక్షిణాధి రాష్ట్రాల వాటానే 60 శాతానికిపైగా ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ముఖ్యనగరాల్లోనూ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.

 మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

అక్షయ తృతీయ సందర్భంగా సికింద్రాబాద్‌‌లోని మానేపల్లి బంగారం దుకాణంలో కొనుగోలుదారులతో సందడిగా ఉన్న దృశం.

 మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

అడ్వాన్స్‌ బుకింగ్‌లు, ఆఫర్లు, రాయితీలతో దుకాణదారులు కూడా కస్టమర్ల ఉత్సాహాన్ని పెంచారు. బంగారంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వజ్రాల అమ్మకాలు కూడా పెరిగాయి.

 మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

గతేడాదితో పోలిస్తే ధరలు 10 శాతం వరకు తగ్గడంతో అమ్మకాలు 15-20 శాతం వరకు పెరిగాయని ముంబైకి చెందిన అఖిల భారత జెమ్స్‌ అండ్‌ జువెలరీ ట్రేడ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మనీష్‌ జైన్‌ తెలిపారు.

 మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం విక్రయాలు జోరుగా సాగాయి. దాదాపు అన్ని దుకాణాల్లోనూ పిల్లాపాపలతో కుటుంబాలు బారులు తీరి మరీ కొనుగోళ్లు సాగించాయి.

 మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

ఆభరణాలకున్న డిమాండ్‌ ఈ సారి కాయిన్స్‌, బిస్కట్లు, బార్స్‌కు లేదని కూడా ఆయన చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం చేసే బంగారం కొనుగోళ్లలో దాదాపు 25 శాతం తరుగుదల ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.

 మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట

పెద్ద షాపులతో పాటు చిన్న స్థాయి దుకాణాలు కూడా జోరుగా అమ్మకాలు సాగించాయి. గతే ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే బంగారం ధర 2 శాతం పెరిగినట్టుగా వర్తకులు వెల్లడించారు. చాలా దుకాణాల్లో వెండి వస్తువుల ఉచితంగా అందించారు.

English summary

మెరిసిన బంగారం, కోనుగోలుదార్లతో కిటకిట(ఫోటోలు) | Gold sales increase in city by 20-30 per cent on Akshaya Tritiya

Heavy rush was witnessed at jewellery shops on the occasion of Akshaya Tritiya on Tuesday. Akshaya Tritiya is considered holy by Hindus and Jains. It is believed that buying gold on this day would usher in luck and success to the family members.
Story first published: Wednesday, April 22, 2015, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X