For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొనసాగిన ర్యాలీ: ఏపి సిఐఐ ఛైర్మన్‌గా సురేష్

|

ముంబై/హైదరాబాద్: స్టాక్ మార్కెట్ల ర్యాలీ వారంతపు చివరి రోజు శుక్రవారం కూడా కొనసాగింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నిఫ్టీ సూచీలు మరో కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఒక దశలో ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి 21,960.89 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ సూచీ తర్వాత స్వల్పంగా క్షీణించింది. సెన్సెక్స్ గురువారం నాటి ముగింపుతో పోలిస్తే 405.92 పాయింట్లు పెరిగి సరికొత్త గరిష్ఠ స్థాయిని రికార్డు చేస్తూ 21,919.79 పాయింట్ల వద్ద ముగిసింది.

కాగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ కూడా 2013 డిసెంబర్ 9న నమోదైన గరిష్ట స్థాయి 6,415.25ను అధిగమించి 6,537.80 పాయింట్లకు చేరి చివరకు 6,526.65 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం నాటి ముగింపుతో పోలిస్తే నిఫ్టీ కూడా 125.50 పాయింట్లు లాభపడింది. విదేశీ మదుపుదారులు తమ మద్దతును శుక్రవారం కూడా కొనసాగించారు. స్థిరాస్తి, బ్యాంకింగ్, మూల ధన వస్తురంగం, ఆయిల్ అండ్ గ్యాస్, సూచీలు 3.7-5.4 శాతాల మధ్య లాభాలను నమోదు చేశాయి. అంతేగాక మదుపరులకు రూ.85వేల కోట్ల మేర లాభాలను చేకూర్చాయి.

BSE Sensex, NSE Nifty rally to record highs

అయితే ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు స్వల్పంగా ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 60కి చేరి మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 30 షేర్ల స్క్రిప్‌లలోబిహెచ్‌ఇఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్, రిల్ తదితర 22 స్క్రిప్‌లు లాభాలను పొందాయి. విదేశీ నిధులు, రిటైల్ ఇన్వెస్టర్లదే ప్రధాన పాత్ర అని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ ప్రెసిడెంట్ జయంత్ మ్యాంగ్లిక్ అన్నారు.

ఏపి సిఐఐ ఛైర్మన్‌గా సురేష్, వైస్ ఛైర్మన్‌గా వనతా

భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా 2014-15 సంవత్సరానికి సురేష్ నాయుడు చిట్టూరి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన సిఐఐ-ఏపి సమావేశంలో ఈ ఎన్నికల్లో వైస్ ఛైర్మన్‌గా వనతా దాట్లను ఎన్నుకున్నారు. ప్రస్తుతం సురేష్ నాయుడు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న శ్రీనివాసా హ్యాచరీస్ గ్రూప్ సిఈఓగా వ్యవహరిస్తున్నారు.

బెంగళూరులోని ఆర్‌వి కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సురేష్ నాయుడు, అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ పట్టా పొందారు. కాగా వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన వనతి దాట్ల హైదరాబాద్ కు చెందిన ఎలికో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అండ్ సిఎఫ్ఓగా వ్యవహరిస్తున్నారు. ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బిఏ చదివారు. అంజనీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్, రాశి ఫైనాన్స్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

English summary

కొనసాగిన ర్యాలీ: ఏపి సిఐఐ ఛైర్మన్‌గా సురేష్ | BSE Sensex, NSE Nifty rally to record highs


 
 The NSE Nifty rose to a record high, and the benchmark BSE Sensex hit its record for a second consecutive session, as foreign investors bet big in a country that just months ago was gripped by market turmoil.
Story first published: Saturday, March 8, 2014, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X