For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లో మోడీ మంత్ర: భిన్నాభిప్రాయాలు

|

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బిజెపి తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ ప్రభావం క్యాపిటల్ మార్కెట్ల పైన పడుతుండగా, ఈ విషయమై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మోడీని ప్రధాని అభ్యర్థిత్వ ప్రకటన క్యాపిటల్ మార్కెట్ల పైన కొనసాగుతోంది. ముఖ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు సంబంధించి బిజెపి తీసుకున్న నిర్ణయం సానుకూల పరిణామంగా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఆర్థిక సంస్కరణల విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆరాధిస్తూ వచ్చిన వారంతా ఇప్పుడు మోడీ జపం చేస్తున్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బిజెపి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే ఆర్థిక రంగానికి అంతకుమించిన శుభవార్త ఉండదని ప్రమెరికా మ్యూచువల్ ఫండ్ ఎండీ విజయ్ వ్యాఖ్యానించడం గమనార్హం. సిఎల్ఎస్ఎ చీఫ్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రిస్ ఉడ్ కూడా ప్రధాని అభ్యర్థిగా మోడీని బిజెపి ప్రకటించడం మార్కెట్లకు సంబంధించి శుభపరిమాణంగా చెప్పవచ్చన్నారు.

Narednra Modi

కాగా మరికొందరు విశ్లేషకులు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి మోడీ ప్రభావం మాట ఎలా ఉన్నా, సామాజిక రంగంలో ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని వారంటున్నారు. దేశీయ పారిశ్రామిక వాణిజ్యరంగంలో ఉత్తర భారతదేశానికి చెందినవారే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ వ్యాపారవేత్తల సమూహమంతా మోడీ అభ్యర్థిత్వంపై సానుకూల దృక్పథంలో ఉన్నాయి.

ఆర్థిక సంస్కరణల విషయంలో కాంగ్రెస్ కంటే బిజెపి భిన్నంగా వ్యవహరించే అవకాశమేమి లేదని, కాంగ్రెస్ సంశయించిన చోట బిజెపి దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నట్లు మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లపై నరేంద్రమోడీ సానుకూల ప్రభావం చూపడానికీ కొన్ని కారణాలున్నాయి. నరేంద్ర మోడీ గుజరాత్ లో చేసిన అభివృద్ధి దేశం మొత్తానికి ఓ నమూనాగా మారింది.

దేశీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తమకు బిజెపి సన్నిహితంగా ఉంటుందని భావించడం. కాగా కాంగ్రెస్‌‌కు అనుకూలంగా ఉన్న వ్యాపార వేత్తలు కూడా బిజెపిపై కూడా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణలకు గతంలో బిజెపి పాలనలో వేసిన పునాదులే కారణమని భావించేవారూ ఉన్నారు.

పదేళ్ల కాంగ్రెస్ పాలన అనుభవం తర్వాత దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో ముఖ్యంగా బహుళజాతి సంస్థల్లో మన్మోహన్‌సింగ్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వంపై క్రమంగా నమ్మకం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక రంగంలో పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేకపోవడం, ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల విషయంలో మార్కెట్ అంచనాలకు అనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో వ్యాపార వేత్తలు బిజెపివైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

1984లో ప్రధాని అభ్యర్థిగా రాజీవ్ పేరు ప్రచారంలోకి రావడంతో మార్కెట్లు, వ్యాపార వేత్తలపై ఎలాంటి ప్రభావం చూపిందే అదే ఇప్పుడు పునరావృమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధికి నమూనాగా గుజరాత్‌ను మార్చిన మోడీనే దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దగలరని పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

English summary

మార్కెట్లో మోడీ మంత్ర: భిన్నాభిప్రాయాలు | Narednra Modi becoming PM will be a positive for the market

Vijai Mantri said that Narendra Modi has not become prime minister yet. There is a nine-month waiting period before the elections. But this is the first time after 1984 that people are rallying around one person.
Story first published: Monday, September 16, 2013, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X