For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ

By Nageswara Rao
|

Reserve Bank of India
ముంబై: కరెంటు ఖాతా లోటుకు కారణమైన బంగారం దిగుమతులపై సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరిమితులతో కూడిన షరతులను విధించింది. బ్యాంకులు బంగారాన్ని అపరిమితంగా దిగుమతి చేసుకుంటుండంతో.. కరెంటు ఖాతా లోటుకు కారణమవుతుంది. దీంతో రంగంలోకి దిగిన ఆర్‌బీఐ బంగారం అవసరానికి మించి జరిగే దిగుమతులపై ఆంక్షలు విధించింది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ ఏడాది బంగారం, వెండి దిగుమతులు 138 శాతానికి పెరిగాయి. 2012 ఏప్రిల్ నెలలో 3.1 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం, వెండి దిగుమతులు 2013 ఏప్రిల్ నెల కల్లా 7.5 బలియన్ డాలర్లు అయింది.

దీంతో ఆగ్రహించిన ఆర్‌బీఐ కన్‌సైన్‌మెంట్ బేసిస్‌పై బ్యాంకులు దిగుమతి చేసుకునే పసిడిని పరిమితి చేసింది. బంగారం దిగుమతులపై ఇప్పటికే ఉన్న నిబంధలను మరింత కఠినం చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. బంగారంపై ఆర్ బీఐ ఏర్పాటు చేసిన కమిటి తీసుకున్న సిఫార్సులను అమలుచేస్తూ బంగారం దిగుమతిపై ఆంక్షలను ప్రవేశపెట్టింది. ఐతే బంగారు ఆభరణాల ఎగుమతిదారులను ప్రొత్సహించేందుకుగాను బ్యాంకులు అందించే సాయంపై ఆంక్షలను మాత్రం విధించ లేదు. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు రికార్డు స్థాయిలో 6.7 శాతం పెరిగిన విషయం తెలిసిందే.

కరెంట్ ఖాతా లోటును వేగంగా పెంచుతున్న బంగారం, వెండి వంటి ఖరీదైన వాటి దిగుమతులతో ఇన్నాళ్లూ ద్రవ్యోల్బణం తగ్గించే లక్ష్యంతో ద్రవ్యవిధాన సమీక్షలు జరుపుతున్న ఆర్‌బిఐ ఇప్పుడు కరెంట్ ఖాతా లోటును తగ్గించే లక్ష్యంతో సమీక్షలు చేయాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చిలో నికరంగా రూ. 4,510 కోట్ల విలువైన బంగారాన్ని స్పాట్ ఫారెక్స్ మార్కెట్‌లో కొనుగోలు చేసింది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

బ్యాంకుల బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ | RBI puts brake on banks to import gold | బ్యాంకుల బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ

With gold imports putting pressure on the current account deficit, the Reserve Bank of India on Monday imposed restrictions on import of the yellow metal by banks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X