For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లోకి FPIల జోరు, టాప్ 10 రంగాల్లోకి 78 శాతం: అమెరికా నెంబర్ వన్

|

దలాల్ స్ట్రీట్‌లోకి పెద్ద ఎత్తున విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ వరకు 33.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి వచ్చాయి. దేశీయ కరెన్సీ రూపాయిలో ఇది రూ.2.45 లక్షల కోట్లు. ఈక్విటీతో పాటు రుణ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. గత ఆరేళ్లలో ఇదే గరిష్టం. 2014-15లో 46 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. తాజా రాకతో FPI పెట్టుబడుల వ్యాల్యూ 592.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 537.4 బిలియన్ డాలర్లు ఈక్విటీల్లోకి రాగా, 51.38 బిలియన్ డాలర్లు డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. FPIలకు సంబంధించి కేర్ రేటింగ్స్ గణాంకాలు ఇలా ఉన్నాయి..

వివిధ రంగాల్లోకి ఇలా

వివిధ రంగాల్లోకి ఇలా

FPIలు ఎక్కువగా ఆర్థిక సేవల రంగంలోకి వచ్చాయి. ఆర్థిక సేవల రంగంలోకి అత్యధికంగా 191.3 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ తర్వాత సాఫ్టువేర్‌లోకి 76.1 బిలియన్ డాలర్లు, ఆయిల్ అండ్ గ్యాస్‌లోకి 50 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ అండ్ ఆటో కంపొనెంట్స్‌లోకి 26.9 బిలియన్ డాలర్లు, ఫార్మాస్యూటికల్స్ అండ్ బయోటెక్నాలజీలోకి 22.8 బిలియన్ డాలర్లు, సావరిన్‌‌లోకి (డెట్) 21.7 బిలియన్ డాలర్లు, హౌస్ హోల్డ్స్ అండ్ పర్సనల్ ప్రోడక్ట్స్‌లోకి 20.2 బిలియన్ డాలర్లు, కేపిటల్ గూడ్స్‌లోకి 19.8 బిలియన్ డాలర్లు, ఫుడ్, బీవరేజ్ అండ్ టుబాకోలోకి 15.7 బిలియన్ డాలర్లు, బీమా రంగంలోకి 13.4 బిలియన్ డాలర్లు వచ్చాయి.

టాప్ 10 రంగాల్లోకి 78 శాతం

టాప్ 10 రంగాల్లోకి 78 శాతం

టాప్ 10 రంగాల్లోకి 78 శాతం FPIలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 34 బిలియన్ డాలర్లలో కేవలం డిసెంబర్ నెలలోనే 8.4 బిలియన్ డాలర్లు వచ్చాయి. కేర్ డేటా ప్రకారం FPI ఇన్-ఫ్లో FY19, FY20లో నెగిటివ్‌గా ఉంది. కరోనా మహమ్మారి ప్రకటన నేపథ్యంలో FY20 చివరలో (మార్చి) మార్కెట్ బ్లడ్‌బాత్ కారణంగా 3 బిలియన్ డాలర్ల వెనక్కి వెళ్లాయి.

లగ్జంబర్గ్ మీదుగా

లగ్జంబర్గ్ మీదుగా

వివిధ దేశాల నుండి వచ్చిన పెట్టుబడుల జాబితాలో అమెరికా ముందుంది. అగ్రరాజ్యం 34 శాతం వాటాతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారిషస్(11 శాతం), సింగపూర్(8.8 శాతం), లగ్జంబర్గ్(8.6 శాతం), బ్రిటన్(5.3 శాతం), ఐర్లాండ్(4 శాతం), కెనడా(3.4 శాతం), జపాన్(2.8 శాతం), నెదర్లాండ్, నార్వే దేశాల వాటా 2.4 శాతంగా ఉంది. ఇక లగ్జంబర్గ్ మీదుగా ఎక్కువ FPIలు తరలి వస్తున్నాయి.

English summary

భారత్‌లోకి FPIల జోరు, టాప్ 10 రంగాల్లోకి 78 శాతం: అమెరికా నెంబర్ వన్ | 10 sectors that gained most as FPIs pumped $34 billion into D Street

Foreign portfolio investors (FPIs) have pumped in a whopping $33.8 billion into domestic equities and debt till February 15 this fiscal year -- the highest since FY15 when it was nearly $46 billion --taking their net outstanding investments to a record $592.5 billion, as per a report.
Story first published: Friday, February 19, 2021, 9:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X