నెలకు ₹1,000 పొదుపు చేస్తే ₹60 లక్షలు సంపాదించవచ్చా? మ్యూచువల్ ఫండ్స్ మ్యాజిక్ ఫార్ములా ఇది!
ఈ రోజుల్లో ఉద్యోగంలో చేరిన కొత్తలో లేదా తక్కువ జీతం వచ్చేటప్పుడు చాలా మంది "నాకు వచ్చేదే కొద్దిగా.. ఇందులో నేనేం పొదుపు చేస్తాను?" అని లైట్ తీసుకుంటారు. ఆస్తిపాస్తులు కూడబెట్టాలంటే లేదా ధనవంతులు అవ్వాలంటే భారీగా జీతం ఉండాలి, లేదంటే చేతిలో లక్షల రూపాయల డబ్బుండాలి అనుకుంటారు. కానీ, ఆర్థిక నిపుణులు చెప్పే మాట ఇంకొకటి. ధనవంతులు అవ్వడానికి ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేశామన్నది కాదు.. ఎంత క్రమశిక్షణతో, ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేశామన్నదే ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) ద్వారా నెలకు కేవలం ₹1,000 దాచినా సరే.. కాంపౌండింగ్ (చక్రవడ్డీ) పవర్‌తో అది కాలక్రమేణా ఒక భారీ నిధిగా మారుతుంది.
భారతదేశంలో ప్రస్తుతం పసిపిల్లల నుండి ముసలివారి దాకా అందరి నోటా వినిపిస్తున్న పేరు మ్యూచువల్ ఫండ్స్. ముఖ్యంగా కెరీర్ ప్రారంభించే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం. మనలాంటి చిన్న ఇన్వెస్టర్ల దగ్గర నుండి డబ్బులు సేకరించి, వాటిని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా ఇతర ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో ప్రతి నెలా కొంత స్థిర మొత్తాన్ని ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ చేయడాన్నే ఎస్‌ఐపీ (SIP - Systematic Investment Plan) అంటారు.

మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నా సేఫ్!
ఎస్‌ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే అతిపెద్ద లాభం ఏంటంటే.. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ పడిపోయినప్పుడు మన ₹1,000 కి ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) యూనిట్లు వస్తాయి. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. దీనినే 'రూపీ-కాస్ట్ యావరేజింగ్' అంటారు. ఇది లాంగ్ రన్‌లో మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించి మంచి లాభాలను అందిస్తుంది.
అయితే, ఇందులో అసలైన మ్యాజిక్ అంతా కాంపౌండింగ్‌లోనే ఉంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడిపై వచ్చే లాభాల మీద కూడా మళ్లీ లాభాలు వస్తూ ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే, ఈ మ్యాజిక్ అంత బలంగా పనిచేస్తుంది.
అక్షరాలా ₹60 లక్షలు.. లెక్కలు ఇవే!
ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రతి నెలా ₹1,000 చొప్పున ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (mutual funds) లో 25 ఏళ్ల పాటు ఎస్‌ఐపీ చేశాడనుకుందాం. సగటున ఏడాదికి 12 శాతం రిటర్న్స్ వచ్చినా.. అతను మొత్తం ఇన్వెస్ట్ చేసేది కేవలం ₹3 లక్షలు మాత్రమే. కానీ, 25 ఏళ్ల తర్వాత ఆ డబ్బు ఏకంగా ₹17 లక్షల భారీ మొత్తంగా మారుతుంది.
ఒకవేళ ఇదే ఇన్వెస్ట్‌మెంట్‌ను మరో పదేళ్లు పొడిగించి, 35 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తే.. మొత్తం పెట్టుబడి ₹4.2 లక్షలు అవుతుంది. కానీ చేతికి వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? ఏకంగా ₹60 లక్షల పైమాటే! చిన్న వయసులోనే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయడం ఎంత ముఖ్యమో ఈ లెక్క చూస్తేనే అర్థమవుతుంది.
గ్యారెంటీ ఉండదు.. కానీ ఓపిక ఉంటే లాభమే!
ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం అయిపోయింది. పెద్ద నాలెడ్జ్ లేకపోయినా మొబైల్ యాప్స్ ద్వారా నెలకు ₹100 లేదా ₹500 తో కూడా ఎస్‌ఐపీలు స్టార్ట్ చేయవచ్చు. అందుకే స్టూడెంట్స్, చిన్న ఉద్యోగులు కూడా ఇందులో ఈజీగా జాయిన్ అవుతున్నారు.
కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక.. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నవి. ఇందులో స్థిరమైన వడ్డీ రేట్లు లేదా గ్యారెంటీ రిటర్న్స్ ఉండవు. షార్ట్ టర్మ్‌లో మార్కెట్ పడిపోయినప్పుడు నష్టాలు రావచ్చు. అందుకే ఓపికగా లాంగ్ టర్మ్ కోసం చూసే వారికి మాత్రమే ఇది బాగా సెట్ అవుతుంది. రిటైర్మెంట్, పిల్లల చదువులు, సొంతింటి కల లాంటి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ట్రెడిషనల్ సేవింగ్స్ కంటే ఇవే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి.


Click it and Unblock the Notifications