For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏమిటీ ఎల్ఓసీ లోన్: కావాల్సినప్పుడు అవసరమైనంత డబ్బు .. ప్రయోజనమెంతో

|

క్రమం తప్పకుండా ఓ నిర్ధారిత సమయంపాటు ఆర్థిక సాయం అవసరమైన వారికి లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు మీ వేతనం, మీ కంపెనీ, మీ ఆదాయాన్ని, మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి రుణాలు ఇస్తుంటాయి. కొన్ని సందర్భాలలో అవసరానికి మించి రుణం పొందుతాం. సాధారణ రుణాల విషయంలో పరిమితులు ఉంటాయి. అంటే అవసరం లేకపోయినా బ్యాంకులు ఇచ్చే మొత్తం తీసుకోవాల్సి వస్తుంది.

మరికొన్ని సమయాల్లో నిర్ధారిత సమయంలో నిత్యం అవసరం పడుతుంది. బ్యాంకులు అవసరమైనప్పుడల్లా రుణాలు ఇవ్వవు. కాబట్టి ఒకేసారి రుణం తీసుకొని, దానిని బ్యాంకులో లేదా ఇతర మార్గాల్లో దాచుకొని ఉపయోగించుకోవాలి. కానీ అప్పుడు మనకు వడ్డీ పెరుగుతుంది. అలా కాకుండా అవసరం మేరకు బ్యాంకులు అందించే లైన్ ఆఫ్ క్రెడిట్(LOC) లేదా క్రెడిట్ లైన్ ఎంతో ఉపయోగకరం.

హోంలోన్ నుండి రిటైల్ లోన్ వరకు.. అన్నింటిపై గుడ్‌న్యూస్హోంలోన్ నుండి రిటైల్ లోన్ వరకు.. అన్నింటిపై గుడ్‌న్యూస్

అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకునే వెసులుబాటు

అవసరాన్ని బట్టి డబ్బులు తీసుకునే వెసులుబాటు

నిర్దిష్ట కాలంలో క్రమం తప్పకుండా డబ్బులు అవసరమైన వారికి లైన్ ఆఫ్ క్రెడిట్ సరైన పరిష్కారంగా చెబుతారు. ఈ విధానంలో రుణగ్రహీత బ్యాంకు నుండి ఒక నిర్దిష్ట రుణ మొత్తానికి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆ మొత్తం ఒకేసారి వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత అవసరానికి తగినంత వినియోగించుకొని, మిగతా మొత్తాన్ని అకౌంట్‌లో అలాగే ఉంచవచ్చు. ఖాతా నుంచి తీసిన మొత్తంపై మాత్రమే వడ్డీ ఉంటుంది. అలాగే ఈ విధానంలో సంప్రదాయ రుణంతో పోలిస్తే చాలా సంస్థలు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి.

ఇదో రకమైన క్రెడిట్ కార్డ్ కానీ

ఇదో రకమైన క్రెడిట్ కార్డ్ కానీ

ఈ లోన్ ఓ రకంగా క్రెడిట్ కార్డ్ వంటిది. అయితే క్రెడిట్ కార్డు నిత్యం ఉంటుంది. ఇది మీ రుణ పరిమితిని బట్టి ఆ సమయానికి ఉంటుంది. మీకు బ్యాంకు రూ.1 లక్ష మంజూరు చేస్తే అందులో మీకు రూ.50వేలు అవసరమైతే, వాటిని తీసుకుంటే ఆ మొత్తానికే వడ్డీ పడుతుంది.

రెండు రకాలు

రెండు రకాలు

LOCలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్, రెండు అన్-సెక్యూర్డ్. సెక్యూర్డ్ విధానంలో బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు తక్కువ. ఈ విధానంలో విలువైన ఆస్తులు తనఖా పెట్టాలి. కాబట్టి వడ్డీ రేటు తక్కువ. ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు.ఇక, అన్-సెక్యూర్డ్ విధానంతో రుణంపై వడ్డీ రేటు ఎక్కువ. ఏ ఆస్తులు తనఖా పెట్టవలసిన అవసరం లేదు.

చెల్లింపుల ప్రయోజనం

చెల్లింపుల ప్రయోజనం

ఇతర రుణాల్లాగే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేక పద్ధతి ఏమీ లేదు. పర్సనల్ లోన్‌కు అర్హులయ్యే వారంతా లైన్ ఆఫ్ క్రెడిట్‌కు కూడా అర్హులే. రుణాన్ని తిరిగి చెల్లించే పద్ధతులు బ్యాంకులను బట్టి కూడా ఉంటాయి. ఈఎంఐ కింద మార్చుకునే వెసులుబాటు ఉంది. లేదా వడ్డీ మాత్రమే చెల్లించి అసలు వాయిదా వేసుకోవచ్చు. అసలు మొత్తాన్ని కూడా వీలైనంత సర్దుబాటు చేయవచ్చు. అయితే దీనికి ఓ కాలపరిమితి ఉంటుంది. ఆ సమయంలో చెల్లించాలి.

English summary

ఏమిటీ ఎల్ఓసీ లోన్: కావాల్సినప్పుడు అవసరమైనంత డబ్బు .. ప్రయోజనమెంతో | What Is a Line of Credit and How Does It Work?

A line of credit is a preset amount of money that a financial institution like a bank or credit union has agreed to lend you. You can draw from the line of credit when you need it, up to the maximum amount. You'll pay interest on the amount you borrow.
Story first published: Wednesday, March 17, 2021, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X