For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ 'బ్రీఫ్‌కేస్' సీక్రెట్ తెలుసా, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది?

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు బడ్జెట్ తయారీ, సంప్రదాయ హల్వా వేడుక, బడ్జెట్ తయారీతో సంబంధం ఉన్న వారికి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఎవరితో సంబంధాలు లేకుండా ఉండటం వంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఉంటాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు ఆర్థికమంత్రి లెదర్ బ్రీఫ్‌కేస్‌తో పార్లమెంటు ఎదుట కనిపిస్తారు.

బడ్జెట్ గురించి మరిన్ని ఆసక్తికర కథనాలు

ఆ సంప్రదాయం...

ఆ సంప్రదాయం...

పార్లమెంటు ఎదుట బడ్జెట్ పత్రాలతో ఆర్థికమంత్రి కనిపించే సంప్రదాయం యునైటెడ్ కింగ్‌డమ్‌లో 18వ శతాబ్ధానికి సంబంధించినది. ఆ ప్రభావంతో ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. భారత్ ఇప్పటికీ నాటి బ్రిటిష్ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

అందుకే బాక్స్‌ను తెచ్చారు...

అందుకే బాక్స్‌ను తెచ్చారు...

మొట్టమొదటి బడ్జెట్ బాక్స్‌ను 1860లో యూకే ఛాన్సులర్ కోసం తయారు రూపొందించారు. విలియమ్ ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ ఒక చెక్కపెట్టేతో ఆరంభించారు. బడ్జెట్ పత్రాలను బ్లాక్ శాటిన్‌తో కప్పేవారు. దీని కంటే ముందు లెదర్ బ్యాగ్‌లలో బడ్జెట్ పత్రాలను హౌస్ ఆఫ్ కామన్స్‌కు తీసుకు వెళ్లేవారు. విలియమ్ ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ ఎక్కువగా ప్రసంగిస్తారనే పేరు ఉంది. దీంతో తన బడ్జెట్ పత్రాలను ఉంచేందుకు ఆయన బాక్స్ అడిగినట్లుగా చెబుతారు. ఈ కింది చిత్రం గ్లాడ్‌స్టోన్ ఫేమస్ బాక్స్‌గా చెబుతారు.

బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చింది?

బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చింది?

బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ బౌగెట్ (Bougette) అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం చిన్న బ్యాగ్ అని. బడ్జెట్ ప్రవేశ పెట్టే బాక్సును యూకేలో బడ్జెట్ బాక్స్ అని పిలుస్తారు. భారత్‌లో బ్రీఫ్‌కేస్ అంటారు.

బ్రీఫ్ కేస్ కలర్

బ్రీఫ్ కేస్ కలర్

ప్రతి సంవత్సరం రెడ్ బాక్స్‌ను తదుపరి ఛాన్సులర్‌కు ఇచ్చే సంప్రదాయాన్ని యూకే పాటిస్తోంది. అయితే ఈ బాక్స్ చాలా పాతదిగా మారి, చిరిగిపోవడంతో 2011లో కొత్త దానిని తీసుకు వచ్చారు. 2011లో జార్జ్ ఓస్బోర్న్ కొత్త బడ్జెట్ బాక్స్ తెచ్చారు. ఈ కింది బాక్స్ అప్పుడు తీసుకు వచ్చిందే.

మన బడ్జెట్ బ్రీఫ్‌కేసు..

మన బడ్జెట్ బ్రీఫ్‌కేసు..

భారతదేశంలో మాత్రం మన ఆర్థికమంత్రులు ఎరుపు, నలుపు వంటి రంగు బ్రీఫ్‌కేస్ ఉయోగిస్తారు. అలాగే, బ్రీఫ్‌కేసును తదుపరి ఆర్థికమంత్రికి ఇచ్చే యూకే వంటి సంప్రదాయం మన వద్ద లేదు.

వివిధ బ్రీఫ్‌కేసులు..

వివిధ బ్రీఫ్‌కేసులు..

మన ఆర్థికమంత్రులు వివిధ రకాల బ్రీఫ్‌కేసులు ఉపయోగించారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపయోగించిన బ్రీఫ్‌కేస్ మాత్రం యూకే నాటి గ్లాడ్‌స్టోన్ బాక్సును తలపించేలా నలుపు రంగు బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఉపయోగించారు. పి చిదంబరం బ్రిటిషర్స్ మాదిరి స్కార్లెట్ లెదర్ బ్రీఫ్‌కేస్‌తో కనిపించేవారు. అరుణ్ జైట్లీ 2015లో టాన్ బ్రీఫ్‌కేసుతో వచ్చారు.

బడ్జెట్ బ్రీఫ్‌కేసులో ఏముంటుంది?

బడ్జెట్ బ్రీఫ్‌కేసులో ఏముంటుంది?

కేంద్ర ఆర్థికమంత్రి ప్రసంగించేందుకు సంబంధించిన పత్రాలు, తదుపరి ఏడాదికి సంబంధించిన బడ్జెట్ పత్రాలు బ్రీఫ్‌కేసులో ఉంటాయి.

English summary

బడ్జెట్ 'బ్రీఫ్‌కేస్' సీక్రెట్ తెలుసా, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? | The Story Behind the Union Budget Briefcase

The Union Budget of India has many traditions with interesting fact-based stories like the halwa ceremony. Another observation you must have made is that our Finance Minister poses with a leather briefcase on the Budget Day before he heads to make his speech. The origin of that tradition dates back to 18th century in the United Kingdom. India too is influenced by this British tradition.
Story first published: Wednesday, January 22, 2020, 14:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X