For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EPFO UAN నెంబర్ మరిచిపోయారా, ఆన్‌లైన్ ద్వారా ఇలా పొందండి

|

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) జారీచేసిన 12 అంకెల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్(UAN) ద్వారా ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్, ఇతర ఈపీఎఫ్ వివరాలను తెలుసుకోవచ్చు. ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారినప్పుడు PF అకౌంట్ పోర్టబులిటీలో UAN నెంబర్ చాలా కీలకం. యజమాని పైన ఆధారపడకుండా పీఎఫ్ అకౌంట్ నుండి మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి కూడా ఇది అవసరం. పాత అకౌంట్ క్లోజ్ చేయడానికి, బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ కోసం ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ సేవల ప్రయోజనాలు పొందడానికి, UANను ఉద్యోగుల కేవైసీ వివరాలతో లింక్ చేయాలి. ఎంతో కీలకమైన UAN నెంబర్‌ను మరిచిపోతే ఇబ్బందే. అలాంటి నెంబర్‌ను ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. కింది సింపుల్ స్టెప్స్ ఉపయోగించి ఉద్యోగులు ఆన్ లైన్ ద్వారా UAN నెంబర్‌ను తిరిగి పొందవచ్చు.

EPFO UAN ఎలా పొందాలి?

EPFO UAN ఎలా పొందాలి?

- ఈపీఎఫ్ఓ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in. లోకి లాగ్-ఇన్ కావాలి.

- హోమ్ పేజీ పైన కనిపించే Know You UAN పైన క్లిక్ చేయాలి.

- EPFO అకౌంట్‌తో లింక్ ఉన్న మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- వెరిఫికేషన్ బాక్స్‌లోని క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ధృవీకరణ చేయడానికి ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత పేరు, పుట్టిన రోజు వంటి ఇతర వ్యక్తిగత వివరాలను అడుగుతుంది. వాటిని పూర్తి చేయాలి.

- వ్యక్తిగత వివరాలు పూర్తి చేసిన తర్వాత ఆధార్, పాన్ లేదా మెంబర్ ఐడీ అడుగుతుంది. ఇది చివరి వెరిఫికేషన్ స్టెప్.

- అవసరమైన వివరాలు ఇచ్చి, Show My UAN పైన క్లిక్ చేయాలి.

- మీ యూఏఎన్ స్క్రీన్ పైన డిస్-ప్లే అవుతుంది.

- స్క్రీన్ షాట్ తీయడం ద్వారా లేదా ఆ నెంబర్‌ను రాసుకోవడం ద్వారా దానిని సేవ్ చేసుకోవాలి.

ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి లాగ్-ఇన్..

ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి లాగ్-ఇన్..

- ఈపీఎఫ్ఓ మెంబర్ అధికారిక పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావాలి.

- హోం పేజీ పైన కనిపించే Activate UAN పైన క్లిక్ చేయాలి.

- యూఏఎన్, మెంబర్ ఐడీ, ఆధార్ లేదా పాన్ కార్డును ఎంచుకోవాలి.

- పేరు, పుట్టిన రోజు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.

- బాక్స్‌లో కనిపించే క్యాప్చా కోడ్‌ను వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయాలి.

- మీ రిజిస్టర్ నెంబర్‌కు వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది.

- ఓటీపీని ఎంటర్ చేసి, Validate OTP and Activate UAN పైన క్లిక్ చేయాలి.

- మీ UAN యాక్టివేట్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పాస్ వర్డ్ వస్తుంది.

- ఒకసారి యాక్టివేట్ అయ్యాక, మీరు ఈ పాస్ వర్డ్‌ను ఉపయోగించవచ్చు.

ఈపీఎఫ్ ఖాతా వివరాలు

ఈపీఎఫ్ ఖాతా వివరాలు

EPFO ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రయివేటు ఉద్యోగులకు తన సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. వడ్డీ ప్రయోజనం, పన్ను మినహాయింపులు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి వివిధ ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ అందిస్తోంది. ప్రతి నెల ఉద్యోగి వేతనం నుండి కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అంతేమొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి ఖాతాలా జమ చేస్తుంది. మీరు ఈపీఎఫ్ వివరాలు తెలుసుకోవడానికి మీకు యూఏఎన్ తప్పనిసరి. 12 అంకెల యూనిక్ నెంబర్. ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో UAN నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మీ ఈఫీఎఫ్ ఖాతా వివరాలు కనిపిస్తాయి. మీ పీఎఫ్ నగదు మొత్తాన్ని కొన్ని సందర్భాల్లో ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగం మారిన సందర్భంలో కొత్త ఆఫీసు ఈపీఎఫ్ ఖాతాకు మీ నగదు సైతం బదిలీ చేసుకోవచ్చు.

English summary

EPFO UAN నెంబర్ మరిచిపోయారా, ఆన్‌లైన్ ద్వారా ఇలా పొందండి | PF Update: How to Retrieve EPFO UAN online?

The Unique Identification Number issued by the EPFO is a 12 digit code that can be used by account holders to check their provident fund balance and other such EPF details.
Story first published: Monday, October 4, 2021, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X