For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను మినహాయింపు నుండి... ప్లాట్ లోన్, హోమ్ లోన్‌కు తేడాలు తెలుసా?

|

చాలామంది రుణగ్రహీతలు హోమ్ లోన్, ప్లాట్ లోన్‌కు తేడా లేదని భావిస్తారు. ఈ రెండు కొనుగోళ్లు కూడా సాధారణ వాడుక భాషలో ఆస్తిని కొనుగోలు చేసేవిగా చూస్తారు. అయితే హోమ్ లోన్‌కు, ప్లాట్ లోన్‌కు తేడా ఉంది. బ్యాంకు నుండి రుణం తీసుకునే సమయంలో ఈ తేడాలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణంలో ఉన్న లేదా రీసోల్డ్ హోమ్ ప్రాపర్టీ హోమ్ లోన్‌కు వర్తిస్తుంది.

అదే సమయంలో ఇంటిని నిర్మించాలనుకునే స్థలాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ల్యాండ్ లోన్ ఉంటుంది. ప్లాట్లు కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ వర్తించదు. అదే విధంగా రెడీ-టూ-హోం ప్రాపర్టీ లేదా అసంపూర్తిగా ఉన్న వాటి నిర్మాణం కోసం ల్యాండ్ లోన్ వర్తించదు.

ల్యాండ్ లోన్ వర్సెస్ హోమ్ లోన్

ల్యాండ్ లోన్ వర్సెస్ హోమ్ లోన్

ప్రాపర్టీ పైన పొందే రుణ మొత్తాన్ని లోన్ టు వ్యాల్యూ(LTV)గా పేర్కొంటారు. హోమ్ లోన్ అనేది రెసిడెన్షియల్ కాబట్టి ప్లాట్ లోన్ కంటే హోమ్ లోన్ ఎక్కువగా వస్తుంది. అంటే ప్లాట్ LTV కంటే హోమ్ లోన్ వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది. రూ.30 లక్షల లోపు రుణానికి LTV 90 శాతం వరకు ఉంటుంది. ప్లాట్ అయితే 70 శాతం వర్తిస్తుంది.

అంటే మీరు వ్యక్తిగత లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం భూమిని కొనుగోలు చేయాలని భావిస్తే మీ వద్ద కనీసం మొత్తం ఉండాలి. అంటే భూమి వ్యాల్యూలో ముప్పై శాతం మీ వద్ద ఉండాలి. హోమ్ లోన్‌కు అయితే గరిష్టంగా 30 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. అదే సమయంలో ల్యాండ్ లోన్ అయితే గరిష్ట కాలపరిమితి 15 సంవత్సరాలు.

ట్యాక్స్ ప్రయోజనాలు

ట్యాక్స్ ప్రయోజనాలు

హోమ్ లోన్ పైన తీసుకునే రుణం విషయంలో వడ్డీ, ప్రధాన చెల్లింపుపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. కానీ ప్లాట్ కొనుగోలుపై పన్ను ప్రయోజనాలు లేవు. ప్లాట్ విషయంలో సాధ్యమయ్యే ఏకైక పన్ను మినహాయింపు ఆ ప్లాట్‌లో నిర్మించడానికి తీసుకున్న రుణం మాత్రమే. ప్లాట్ పైన రుణం తీసుకునే వారికి పన్ను మినహాయింపు లేకపోవడం ముఖ్యమైన ప్రతికూలత.

ల్యాండ్ లోన్Xహోమ్ లోన్ వడ్డీ రేట్లు

ల్యాండ్ లోన్Xహోమ్ లోన్ వడ్డీ రేట్లు

హోమ్ లోన్ పైన ప్రస్తుతం దాదాపు 7.50 శాతం (ఎక్కువగా) వరకు వడ్డీ రేటు ఉంది. ప్లాట్ లోన్స్ 8 శాతం నుండి 10 శాతం వరకు ఉన్నాయి. హోమ్ లోన్ కంటే ప్లాట్ లోన్ కాస్త రిస్క్‌తో కూడుకున్నది.

వ్యత్యాసాలు ఉన్నప్పటికీ..

వ్యత్యాసాలు ఉన్నప్పటికీ..

హోమ్ లోన్ లేదా ప్లాట్ లోన్ మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ దరఖాస్తు విధానం, రుణ వడ్డీ రేట్లు ఒకేలా ఉంటాయి. హోమ్ లోన్, ప్లాట్ లోన్ రెండింటిలోను ఏవో ప్రయోజనాలు ఉంటాయి. హోమ్ లోన్ లేదా ప్లాట్ లోన్ తీసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ కీలకం.

English summary

పన్ను మినహాయింపు నుండి... ప్లాట్ లోన్, హోమ్ లోన్‌కు తేడాలు తెలుసా? | Know about plot loan and home loan, What is difference?

Many individuals may not see the difference between purchasing a new home and buying a plot of land, and both purchases would be referred to as buying property in common usage; nonetheless, there are differences that must be considered while seeking financing.
Story first published: Friday, July 16, 2021, 13:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X