For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Muhurat Trading: రేపు ముహూరత్ ట్రేడింగ్, టైమింగ్స్ ఇతర వివరాలు

|

స్టాక్ మార్కెట్లు ఈవారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వర్క్ చేస్తాయి. దీపావళి పర్వదినం సందర్భంగా గురు, శుక్రవారాలు మార్కెట్లకు సెలవు రోజు. అయితే ప్రతి దీపావళి పర్వదినం రోజున ముహూరత్ ట్రేడింగ్ ఉంటుంది. ఈ నెల గురువారం 4వ తేదీన మూహురత్ ట్రేడింగ్ ఉంది. ఓ మంచి పని చేపట్టేముందు ముహూర్తం చూసుకొని ప్రారంభించడం పరిపాటి. పురాణాల్లోని ప్రతి విశ్వాసం, సంప్రదాయం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంటుందని భావిస్తారు.

ఈ నేపథ్యంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపమైన వేడుక దీపావళి. అందుకే చాలామంది ఇన్వెస్టర్లు ఈ పండుగను ప్రత్యేకంగా చూస్తారు. ఈ రోజున ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదంతా బాగుంటుందని భావిస్తారు. అందుకే స్టాక్ మార్కెట్లో ఈ రోజున ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ట్రేడింగ్ నిర్వహిస్తారు.

సుమూహుర్తం రోజున

సుమూహుర్తం రోజున

దీపావళి బలిప్రతిపద సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు రోజు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మొదలయ్యే కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్‌తో ఆహ్వానం పలుకుతాయి. సంవత్ 2078 ప్రారంభ సందర్భంగా సాయంత్రం ఒక గంట పాటు ట్రేడింగ్ ఉంటుంది. బీఎస్ఈలో 1957 నుండి దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. శుభముహూర్తం నేపథ్యంలో ట్రేడింగ్ ఒక పద్ధతిగా మారింది. ఈ సంవత్సరం కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.

ఏ సమయంలో ఏది

ఏ సమయంలో ఏది

ముహూరత్ ట్రేడింగ్ అంటే పరిమిత సమయంలో జరుగుతుంది. రెండు పార్టీల మధ్య స్టాక్ కొనుగోలు/విక్రయానికి సంబంధించి అంగీకారం కుదురుతుంది. దీనిని బ్లాక్ డీల్ సెషన్ అంటారు.

స్టాక్ ఎక్స్చేంజీలు ఈక్విలిబ్రియంను నిర్ణయిస్తాయి. ఈ సెషన్ ఎనిమిది నిమిషాలు ఉంటుంది. ఇది ప్రీ-ఓపెన్ సెషన్.

నార్మల్ మార్కెట్ సెషన్ ఉంటుంది. ఈ సమయంలో అసలు ట్రేడింగ్ జరుగుతుంది.

తేలిగ్గా అమ్ముడుపోని సెక్యూరిటీల ట్రేడింగ్ జరుగుతుంది. ఇది కాల్ ఆక్షన్ సెషన్.

ముగింపు ధర వద్ద ఇన్వెస్టర్లు మార్కెట్ ఆర్డర్‌ను పెడతారు. ఇది క్లోజింగ్ సెషన్.

బ్లాక్ డీల్ సెషన్ 17:45 - 18:00, ప్రీ-ఓపెన్ మార్కెట్ 18:00 - 18:08, నార్మల్ మార్కెట్ 18:15 - 19:15, కాల్ ఆక్షన్ సెషన్ 18:20 - 19:05, క్లోజింగ్ సెషనల్ 19:25 - 19:35. మొత్తం దాదాపు రెండు గంటలు ఉంటుంది.

సెంటిమెంట్

సెంటిమెంట్

కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో చాలామంది ముహూరత్ ట్రేడింగ్‌లో పాల్గొంటారు. ఈ సమయంలో మంచి స్టాక్స్‌ను ఎంచుకొని, దీర్ఘకాలం కొనసాగించే ప్రయత్నం చేయాలి. చాలామంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కేవలం సెంటిమెంట్ కోసం మాత్రమే ట్రాన్సాక్షన్ నిర్వహిస్తారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఓపెన్‌గా ఉన్న పొజిషన్లకు సెటిల్మెంట్ నిబంధనలు వర్తిస్తాయి. ట్రేడర్లు రెసిస్టెన్స్, సపోర్ట్ స్థాయిలను పరిశీలించాలి.

English summary

Muhurat Trading: రేపు ముహూరత్ ట్రేడింగ్, టైమింగ్స్ ఇతర వివరాలు | Know about Diwali Muhurat Trading: Timings and other details here

The Stock Markets (BSE and NSE) will open for one hour tomorrow (4 November) for the Muhurat Trading session on Diwali. The Muhurat trading is practised to commemorate the start of the new Samvat 2078. That is when the traditional business community open their books of account.
Story first published: Wednesday, November 3, 2021, 15:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X