For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణం కావాలంటే అత్యుత్తమ క్రెడిట్ స్కోర్‌ను బ్యాంకులు ఎలా చూస్తాయి?

|

క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. గుడ్ క్రెడిట్ స్కోర్‌ను బ్యాంకులు పరిగణలోకి తీసుకొని రుణాలు ఇస్తాయి. అంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. అయితే గుడ్ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? బ్యాంకులు దేనిని పరిగణలోకి తీసుకుంటాయి? అనే అంశాలు తెలుసుకోవాలి. బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటే ఉత్తమ వడ్డీ రేట్లు పొందడానికి ఉపయోగపడే కీలక అంశాల్లో క్రెడిట్ స్కోర్. సాధారణంగా 750 పాయింట్లు ఉంటే దానిని మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు. ఐతే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నంత మాత్రాన మీ రుణ దరఖాస్తును తిరస్కరించవద్దనే గ్యారెంటీ లేదు. రుణానికి సంబంధించి క్రెడిట్ స్కోర్ కీలకం. కానీ ఇతర అశలు కూడా ఉంటాయి.

అధిక క్రెడిట్ స్కోర్

అధిక క్రెడిట్ స్కోర్

బ్యాంకులు కొన్ని ఉత్పత్తులపై అధిక క్రెడిట్ స్కోర్‌ను అడుగుతాయి. అధిక క్రెడిట్ లిమిట్ కలిగిన ప్రీమియం కార్డ్స్ పైన ఆయా కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా 800 పాయింట్లకు పైగా క్రెడిట్ స్కోర్ కోరుతాయి. సాధారణంగా ఎక్కువగా 750 పాయింట్లను మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఉత్తమ క్రెడిట్ స్కోర్ అనేది బ్యాంకు, కార్డు, రుణగ్రహీత నిధులపై ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట క్రెడిట్ కార్డు పైన ఉత్తమ రేట్ల కోసం వెతుకుతున్నప్పుడు తెలుసుకోవాల్సిన మరెన్నో అంశాలు ఉన్నాయి.

 దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు

దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు

మన దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హైమార్క్ ఉన్నాయి. ప్రతి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి క్రెడిట్ స్కోర్స్ ఇచ్చేందుకు దని యాజమాన్య పద్ధతులు ఉంటాయి. అందుకే అవి ఒక బ్యూరో నుండి మరొకదానికి భిన్నంగా ఉంటాయి. అయితే ప్రతి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇచ్చే స్కోర్ 300 నుండి 900 మధ్య ఉంటుంది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఈ నాలుగింటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇదే దేశంలో మొదటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. చాలామంది రుణగ్రహీతల సిబిల్ స్కోర్ 750, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి ఉత్తమ హోమ్ లోన్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

క్రెడిట్ స్కోర్ భిన్నంగా

క్రెడిట్ స్కోర్ భిన్నంగా

రుణదాతకు క్రెడిట్ స్కోర్ అవసరం కార్డును భిన్నంగా ఉండవచ్చు. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలకు వేర్వేరు క్రెడిట్ స్కోరును బ్యాంకులు ప‌రిశీలించ‌వ‌చ్చు. సాధారణంగా వ్యక్తిగత రుణాల‌ కంటే హోం లోన్ రుణాలకు క్రెడిట్ స్కోర్ అవసరం తక్కువగా ఉంటుంది. రుణగ్రహీతకు అవసరమైన నిధుల ఆధారంగా క్రెడిట్ స్కోరును మార్చవచ్చు. కారు కొనడానికి ఎవరికైనా వాహ‌న రుణం అవసరమైతే రుణగ్రహీత కారు వ్యాల్యూలో ఎంత శాతం అడుగుతున్నారనే దాని ఆధారంగా కూడా క్రెడిట్ స్కోర్ భిన్నంగా ఉంటుంది. బ్యాంకులు ప‌రిస్థితుల‌ను బట్టి నిబంధ‌లను కఠినతరం చేస్తాయి. కరోనా కారణంగా లాక్‌డౌన్ సమయంలో చాలా వ‌ర‌కు ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నాయి.

English summary

రుణం కావాలంటే అత్యుత్తమ క్రెడిట్ స్కోర్‌ను బ్యాంకులు ఎలా చూస్తాయి? | Know about Credit score, How the banks determine a good credit score?

A good credit score is a must to get the best rates on loans or to get a credit card that you wanted.
Story first published: Sunday, July 18, 2021, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X