For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ద్వారా ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్స్ ఇలా కొనుగోలు చేయండి

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుండి సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ 1 స్కీం సబ్‌స్క్రిప్షన్ సోమవారం ప్రారంభమైంది. తొలి విడత గోల్డ్ బాండ్స్ మే 21వ తేదీన ముగియనుంది. ప్రభుత్వం గోల్డ్ బాండ్ ధరను (ఒక గ్రాముకు) రూ.4,777గా నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఎస్బీఐ కూడా ఈ బాండ్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇక్కడ పెట్టుబడి పెడితే నెలకు రూ.4,950 రాబడి, ఆ వడ్డీ తీసుకోకుంటే మాత్రం...ఇక్కడ పెట్టుబడి పెడితే నెలకు రూ.4,950 రాబడి, ఆ వడ్డీ తీసుకోకుంటే మాత్రం...

రూ.50 తగ్గింపు

రూ.50 తగ్గింపు

ఎస్బీఐ ఖాతాదారులు నేరుగా ఇ-స‌ర్వీస్‌ల కింద ఈ బాండ్స్‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఆర్బీఐతో సంప్ర‌దించి భార‌త ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకునే పెట్టుబ‌డిదారుల‌కు ఇష్యూ ధ‌ర నుండి గ్రాముకు రూ.50 తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. చెల్లింపు డిజిట‌ల్ మోడ్ ద్వారా చేసే ఇన్వెస్టర్లకు గోల్డ్ బాండ్ ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,727గా ధ‌ర నిర్ణ‌యించారు.

ఎస్బీఐలో ఇలా కొనుగోలు

ఎస్బీఐలో ఇలా కొనుగోలు

- తొలిత ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అకౌంట్‌లోకి ఎంటర్ కావాలి.

- eServices పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత Sovereign Gold Bondను ఎంచుకోవాలి.

- terms and conditions చదువుకొని, ఆ తర్వాత proceed పైన క్లిక్ చేయాలి.

- రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాలి. ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్.

- ఆ తర్వాత submit పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత సబ్‌స్క్రిషన్ క్వాంటిటీ, నామినీ వివరాలు పూర్తి చేయడం ద్వారా పర్చేజ్ ఫామ్ నింపాలి.

- ఆ తర్వాత submit పైన క్లిక్ చేయాలి.

ఇలా కూడా కొనుగోలు

ఇలా కూడా కొనుగోలు

ఎస్బీఐ ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లోను గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్బీఐ నియ‌మించిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుండి కూడా బంగారు బాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

భౌతిక బంగారం డిమాండ్‌ను త‌గ్గించ‌డానికి, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉప‌యోగించే ఆర్థిక పొదుపుగా మార్చ‌డానికి 2015 న‌వంబ‌ర్ నెలలో సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కాన్ని కేంద్రం ప్రారంభించింది.

Read more about: sbi scheme gold gold price
English summary

SBI ద్వారా ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్స్ ఇలా కొనుగోలు చేయండి | How to buy sovereign gold bonds online from SBI?

The latest tranche of sovereign gold bonds (SGB) opened for subscription on May 17. The issue price for Sovereign Gold Bond Scheme 2021-22 Series-I has been fixed at ₹4,777 per gram. The country’s top lender State Bank of India (SBI) provides the option of buying SGBs online.
Story first published: Wednesday, May 19, 2021, 16:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X