For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ చేసుకో! కస్టమర్లకు HDFC అదిరిపోయే ఆఫర్లు, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవలి వరకు కార్యకలాపాలు క్షీణించాయి. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నాయి. పండుగ సమయం నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్, పర్సనల్, గోల్డ్, వెహికిల్, హోమ్ లోన్ పైన ఇటీవల ఆఫర్లు ప్రకటించింది. తాజాగా ప్రయివేటు రంగ దిగ్గజం HDFC బ్యాంకు కూడా ఫెస్టివ్ ట్రీట్ పేరుతో పండుగ సమయంలో తమ కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. వివిధ లోన్‌ల నుండి ప్రాసెసింగ్ ఫీజు వరకు తగ్గింపు వరకు ఎన్నో ఆఫర్లు ఇచ్చింది. గత ఆరు నెలలుగా కరోనా కారణంగా కార్యకలాపాలు పడిపోయాయి. ఆఫర్ల ద్వారా డిమాండ్ పెంపొందించుకోవాలని భావిస్తున్నాయి.

ఆటో, పర్సనల్, గోల్డ్, హోమ్‍‌లోన్లపై SBI బంపరాఫర్: ప్రాసెసింగ్ ఫీజు 0, ఇలా చేస్తే వడ్డీ చాలా తక్కువఆటో, పర్సనల్, గోల్డ్, హోమ్‍‌లోన్లపై SBI బంపరాఫర్: ప్రాసెసింగ్ ఫీజు 0, ఇలా చేస్తే వడ్డీ చాలా తక్కువ

జీరో నుండి 50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు

జీరో నుండి 50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు

HDFC బుధవారం కస్టమర్లకు ఆఫర్ల కోసం ఫెస్టివ్ ట్రీట్‌ను లాంచ్ చేసింది. లోన్ నుండి బ్యాంక్ అకౌంట్స్ వరకు అన్ని రకాల బ్యాంక్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు, డీల్స్ ఇస్తోంది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు, క్యాష్ బ్యాక్, గిఫ్ట్ వోచర్ సహా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రిటైల్, వ్యాపార కస్టమర్లకు ఈ ప్రయోజనాలు అందిస్తోంది. ఈ మేరకు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. వాహన రుణం, పర్సనల్ లోన్, బిజినెస్ గ్రోత్ లోన్ల పైన 50 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. టూవీలర్స్ లోన్ పైన జీరో ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ చేస్తోంది.

రిటైల్ బ్రాండ్స్‌తో ఒప్పందం

రిటైల్ బ్రాండ్స్‌తో ఒప్పందం

క్రెడిట్ కార్డు పైన కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. HDFC బ్యాంకు వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, అదనపు రివార్డు పాయింట్స్ ఇచ్చేందుకు రిటైల్ బ్రాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్టోర్స్‌లో కొనుగోలు చేసినా, ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసినా ఆఫర్లు వర్తిస్తాయి. ఆన్‌లైన్, ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, టాటా క్లిక్, మింత్ర, పెప్పర్‌ఫ్రై, స్విగ్గీ, గ్రోఫోర్స్ సంస్థలతో టయ్-అప్ అయింది. రిటైల్, కన్స్యూమర్ బ్రాండ్స్ లైఫ్‌స్టైల్, బాటా, మోంటే కార్లో, విజయ్ సేల్స్, కోహినూర్, జీఆర్టీ, ఓఆర్ఆర్ఏ వంటి వివిధ సంస్థలు వివిధ ఉత్పత్తులపై 5 శాతం నుండి 15 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి.

అక్కడా ఆఫర్లు

అక్కడా ఆఫర్లు

HDFC బ్యాంక్ ప్రఖ్యాత కంపెనీల ద్వారా 1,000కి పైగా ఆఫర్లు ఇస్తోంది. సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో స్థానిక మర్చంట్స్‌తో ఒప్పందం ద్వారా రీజినల్ లెవల్లో 2,000 ఆఫర్లు అందిస్తోంది. 53 శాతం బ్రాంచీలు సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్నాయి. తమ బ్యాంకింగ్ సేవలను మారుమూల గ్రామాల్లోకి తీసుకు వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దేశ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని, పండుగ సమయంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, అందుకోసం దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింత పెంచేందుకు బ్యాంకు ఆఫర్లు ప్రకటించిందని బ్యాంకు ఎండీ ఆదిత్యపురి అన్నారు. గత రెండు మూడు నెలలుగా బ్యాంకు రుణాలు తీసుకునేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారని, పండుగ సీజన్లో కస్టమర్లకు సంతృప్తినిచ్చేలా తమ ఆఫర్లు ఉంటాయన్నారు.

రూ.7వేల వరకు క్యాష్ బ్యాక్

రూ.7వేల వరకు క్యాష్ బ్యాక్

కొత్తగా వస్తోన్న ఉత్పత్తులతో సహా అన్ని ఆపిల్ ఉత్పత్తులపై HDFC బ్యాంకు కస్టమర్లు రూ.7,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. 22.5 శాతం మేర క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ, గోద్రేజ్, పానాసోనిక్ బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేసి, నో ఎక్స్ట్రా కాస్ట్ ఈఎంఐగా మార్చుకోవచ్చు. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు, ఈఎంఐ తగ్గింపు, క్యాష్ బ్యాక్, గిఫ్ట్ వోచర్లు మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

English summary

పండుగ చేసుకో! కస్టమర్లకు HDFC అదిరిపోయే ఆఫర్లు, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్ | HDFC Bank bumper offers on credit cards, personal, auto, and home loans

HDFC Bank said that it will offer a 50 percent off on the processing fees on auto loans, personal loans and business growth loans and zero processing fee on two-wheeler loans as a part of its ‘Festive Treats’ 2.0 offer.
Story first published: Wednesday, September 30, 2020, 18:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X