ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సబ్‌స్క్రైబర్ల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. వాట్సాప్ హెల్ప్ లైన్ ఈపీఎఫ్ఓకు చెందిన 138 ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. EPFOకు చెందిన అధికారిక వెబ్ సైట్‌లో ప్రాంతీయ కార్యాలయాల వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. సబ్‌స్క్రైబర్ ఎక్కడ అయితే తన పీఎఫ్ ఖాతాను కొనసాగిస్తున్నారో ఆ వాట్సాప్ నెంబర్‌కు సమస్యలు తెలియజేయవచ్చు.

కరోనా సమయంలో ఆటంకాలు లేకుండా..
ఇప్పటికే ఈపీఎఫ్ఓ సమస్యల కోసం EPFiGMS పోర్టల్, CPGRAMS, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్(ఫేస్‌బుక్, ట్విట్టర్), 24x7 కాల్ సెంటర్‌కు ఈ వాట్సాప్ సేవలు అదనం. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా సబ్‌స్క్రైబర్లు ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు లేదా ప్రశ్నించి ఏదైనా మార్గదర్శనం పొందవచ్చు. 'ఈపీఎఫ్ఓ సభ్యులకు మరింత సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ తాజాగా వాట్సాప్ ఆధారిత హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో సభ్యులకు ఎలాంటి ఆటంకాలులేని సేవలు అందించడమే దీని లక్ష్యమ'ని కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది.

ప్రాంతీయ కార్యాలయం హెల్ప్ నెంబర్ పైన..
అక్టోబర్ 13న ఈపీఎఫ్ఓ వాట్సాప్ ద్వారా 1.64 లక్షల ఫిర్యాదులను పరిష్కరించింది. వాట్సాప్ సేవలు లాంచ్ చేసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా 30 శాతం, EPFiGMS పోర్టల్ ద్వారా 16 శాతం తగ్గాయి.
పీఎఫ్ ఖాతాదారు సంబంధిత ప్రాంతీయ కార్యాలయం హెల్ప్ నెంబర్ పైన వాట్సాప్ సందేశాన్ని పంపించడం ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు పొందవచ్చు.

తెలుగు రాష్ట్రాల హెల్ప్ నెంబర్లు
తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయాల హెల్ప్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి.
విజయవాడ జోనల్ ఆఫీస్ పరిధిలోని గుంటూరు - 0863-2344123, కడప - 9491138297, రాజమండ్రి - 9494633563, విశాఖపట్నం - 7382396602.
హైదరాబాద్ రీజినల్ పరిధిలోని బర్కత్‌పుర (హైదరాబాద్) - 9100026170, మాదాపూర్ (హైదరాబాద్) - 9100026146, కరీంనగర్ - 9492429685, కూకట్‌పల్లి - 9392369549, నిజామాబాద్ - 8919090653, పటాన్‌చెరు - 9494182174, సిద్దిపేట - 9603262989, వరంగల్ - 8702447772.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications